బాషా బ్రదర్స్ రూటు ఎటువైపు..? నాదారి రహదారి టీడీపీనా.. వైసీపీనా..? సిట్టింగ్ ఎమ్మెల్యేతో..!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న సందర్బంగా తమ సత్తా చాటుకోవాలని టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి సిద్దం అయ్యాయి.

ఇలాంటి సమయంలో వైసీపీ, టీడీపీ, జనసేనలో రెబల్ నాయకుల దెబ్బకు టిక్కెట్లు దక్కించుకున్న నాయకులు నానా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలోనే రెబల్ నాయకుల బెడద ఎక్కువ అయ్యింది. ఇదే సమయంలో జనసేన, బీజేపీలో కూడా అసమ్మతి నాయకులు పుట్టుకువస్తుండటంతో ఆ పార్టీ నాయకులు ఇప్పటికే రాజీ చర్చలు మొదలుపెట్టారు.

Madanapalle YCP sitting MLA Nawaz Basha has started tension over which party he will work for

ఇక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కొన్ని చోట్ల టిక్కెట్ దక్కకుపోవడంతో వాళ్లు రెబల్స్ అవుతున్నారు. కొంత మంది ఇప్పటికే పార్టీలు మారిపోవడంతో మరి కొంత మంది నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత అసలు సినిమా చూపించాలని కాచుకుని ఉన్నారని తెలిసింది. రాయలసీమలోని మదనపల్లెలో కూడా ఇలాంటి సీన్ రిపిట్ కావడంతో ఆ నియోజక వర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒకప్పటి నియోజక వర్గం, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని అతి పెద్ద నియోజక వర్గం అయిన మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద పోటీ చేసిన నవాజ్ బాషా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచాంద్రా రెడ్డి ఆశీస్సులతో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డిని కాదని వైసీపీ నవాజ్ బాషాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ సందర్బంలో టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ ఓడిపోయారు.

Madanapalle YCP sitting MLA Nawaz Basha has started tension over which party he will work for

ఇప్నుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కాదని అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో వైసీపీ టిక్కెట్ సంపాధించుకున్న నిషార్ అహమ్మద్ గత నెల నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మాజీ ఎమ్మెల్యేలను పక్కనపెట్టిన చంద్రబాబు నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టీడీపీ టిక్కెట్ ఇచ్చారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎమ్మెల్యే సీటు రాలేదని రగిలిపోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సొంత అన్న, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా తల్లి కడుపున పుట్టిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టీడీపీ టిక్కెట్ రావడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది. వైసీపీ టిక్కెట్ దక్కని నవాజ్ బాషాతో పాటు ఆయన అనుచరులు రిగిలిపోతున్న సమయంలో అదే కుటుంబంలోని వ్యక్తికి టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో మదనపల్లెలో సీన్ రివర్స్ అవుతోంది.

ఇక ఇప్పటికే వైసీపీ టిక్కెట్ మైనార్టీ నాయకుడు నిషార్ అహమ్మద్ కు ఇవ్వడం, టీడీపీ టిక్కెట కూడా మైనార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారింది. రెండు పార్టీలు మైనార్టీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంతో మదనపల్లెలో ముస్లీం ఓట్లు చీలిపోవడానికి అవకాశం ఉందని సామాన్య ప్రజలు, నాయకులు అంటున్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇప్పుడు వైసీపీకి పని చేస్తారా ?, రక్తం పంచుకుని పుట్టిన అన్న షాజహాన్ బాషాకు మద్దతుగా పని చేస్తారా ? అని వేచి చూడాలని మదనపల్లె ఓటర్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+