ఇండియన్(ఇంద్రీ) విస్కీకి అరుదైన గుర్తింపు
భారత్‌లో తయారైన ఇంద్రీ విస్కీ ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా నిలిచింది. 2023 సంవత్సరానికి ఈ బ్రాండ్ అవార్డు గెలుచుకుంది. ఒకరకంగా ఈ గుర్తింపుతో ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ భారత్ లో తయారవుతుందనే పేరు వచ్చింది. ఇంద్రీ విస్కీకి ఈ తరహా ప్రతిష్టాత్మకమైన అవార్డులు గతంలో కూడా వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
100కు పైగా బ్రాండ్లు : ఈ అవార్డు కోసం ప్రపంచంలోనే 100 కు పైగా టాప్ బ్రాండ్స్ పోటీపడగా ఇంద్రీ దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో అవార్డు చేజిక్కించుకుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విస్కీలను సేకరించి అందులో బెస్ట్ విస్కీని ఎంపిక చేస్తారు. అమెరికన్ సింగిల్ మాల్ట్స్, స్కాచ్ విస్కీస్, బోర్బన్స్, కెనడియన్ విస్కీస్, ఆస్ట్రేలియన్ సింగిల్ మాల్ట్స్, బ్రిటీష్ సింగిల్ మాల్ట్స్ సహా అనేక ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పాల్గొన్నాయి. ఇంద్రీ దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ బెస్ట్ గా నిలిచింది.

హిమాలయ పర్వతాల్లోని నీరు: ఇంద్రీ విస్కీని పికాడిల్లీ డిస్టిలరీస్ అనే సంస్థ తయారు చేస్తోంది. విస్కీ తయారీలో నాణ్యత, నిబద్ధత కారణంగానే ఈ అవార్డు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. తెలిపింది. దీని తయారీకి సంబంధించి ఏమేం వాడతారు? వాటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారు? అనే విషయాలను తెలిపింది. రాజస్థాన్‌లో ఎంపిక చేసిన బార్లీ గింజలను తీసుకుని.. హిమాలయాల్లో పుట్టిన యమునా నదిలోని తాజా నీటిని ఉపయోగించి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ విస్కీని తయారు చేస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఈ విస్కీలో ముదురు తీపి, ఎండు ద్రాక్షలను ఉపయోగించినట్లు పేర్కొంది. విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ ఇచ్చే అవార్డ్స్ అనేది లిక్కర్ ఇండస్ట్రీలో ఇచ్చే అత్యంత ముఖ్యమైన అవార్డ్ అని తెలిపింది.












Click it and Unblock the Notifications