మహా కుంభమేళా 2025... దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్ళ జాతర!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆథ్యాత్మిక వేడుక మహా కుంభమేళా నిర్వహణకు రైల్వే ప్రత్యేక రైళ్ళ ద్వారా సేవలు అందిస్తుంది. 40 కోట్లకు పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్న మహా కుంభమేళాకు రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యింది. భారతీయ రైల్వే 50 రోజుల పాటు 10,000 రెగ్యులర్ మరియు 3,000 ప్రత్యేక రైళ్లతో సహా 13,000 రైళ్లను నడుపుతుంది. ఈ మహా కుంభమేళాకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా
మహాకుంభమేళా 2025 ప్రత్యేక రైళ్ల జాబితా:
పశ్చిమ రైల్వే నుండి 98 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించారు. ప్రయాణీకుల సౌలభ్యం, పరిశుభ్రతతో పాటు భద్రతపై దృష్టి పెట్టి స్టేషన్లలో RPF బృందాలను కూడా నియమించారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఉత్తర మధ్య రైల్వే సిద్ధం అయ్యింది. సుమారు 700 దూర ప్రాంత ప్రత్యేక రైళ్లు, దాదాపు 1800 స్వల్ప-దూర (200-300 కి.మీ) రైళ్లను నడుపుతామని ఉత్తర మధ్య రైల్వే పేర్కొంది.

నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రత్యేక రైళ్ళు
నార్త్ ఈస్టర్న్ రైల్వే కూడా ప్రత్యేక రైళ్ళను నడుపుతుంది. జయనగర్ నుండి ఝుసికి ప్రత్యేక రైలు (05285/05286) జనవరి 10, 24, 31, ఫిబ్రవరి 1, మార్చి 1తేదీలలో జయనగర్ నుండి నడుస్తుంది . ఇది మధుబని, దర్భంగా, ముజఫర్‌పూర్, వారణాసి మీదుగా ప్రయాణిస్తుంది. జనవరి 24, 18, 20 తేదీలలో, ఇతర నిర్దిష్ట తేదీలలో గుంటూరు నుండి అజంగఢ్, మౌలాలీ నుండి గయాకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
ప్రత్యేక రైళ్ళు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల జాబితాను కూడా ప్రకటించింది. ఇక విశాఖ పట్నం నుండి విశాఖపట్నం-పీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ ప్రత్యేక రైలు, ఫిబ్రవరి 27 సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. రాయగడ, సింగపూర్ రోడ్, మునిగూడ, కేసింగ, తితిలాగఢ్, కాంతాబంజి మరియు ఖరియార్ రోడ్ మీదుగా.ఇది వెళ్తుంది.
విశాఖ పట్నం నుండి నడిచే ప్రత్యేక రైళ్ళు ఇవే
విశాఖపట్నం-గోరఖ్‌పూర్ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 16వ తేదీ 10.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. బెర్హంపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, నారాజ్ మార్తాపూర్, దెంకనల్, అంగుల్, కెర్జంగా, బోయిండా, రైరాఖోల్, సంబల్‌పూర్ సిటీ, జార్సుగూడ రోడ్ మరియు ఐబి మీదుగా ఇది ప్రయాణిస్తుంది. తిరుపతి-వారణాసి ప్రత్యేక రైలు రాయగడ, కేసింగ, టిట్లాగఢ్, బలంగీర్, బర్గర్ రోడ్, సంబల్పూర్, జార్సుగూడ మరియు రూర్కెలా మీదుగా నడుస్తుంది. నర్సాపూర్-వారణాసి ప్రత్యేక రైలు రాయగడ, కేసింగ, టిట్లాగఢ్, బలంగీర్, బర్గర్ రోడ్, సంబల్పూర్, జార్సుగూడ, రూర్కెలా మీదుగా నడుస్తుంది.












Click it and Unblock the Notifications