కుంభమేళాలో శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం..!!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్న మహాకుంభమేళా లో ఇప్పటికే శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా కుంభమేళాకు వస్తున్న భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళాకు వచ్చే భక్తుల కు టీటీడీ మరో అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు అధికారులతో సమీక్షించిన ఈవో శ్యామల రావు కీలక సూచనలు చేసారు.

కుంభమేళాలో శ్రీవారి కల్యాణోత్సవాలు
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో టిటిడి నిర్వహించనున్న శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఈవో శ్యామల రావు ఆదేశించారు. ప్రయాగ్ రాజ్ సెక్టార్ - 6లో టిటిడి చేపడుతున్న రోజువారి కార్యక్రమాలపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో జరుగనున్న శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉత్తరాది భక్తులు విరివిగా వచ్చే అవకాశం ఉంటుందని, భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Mahakumbh Mela 2025 Srivari Kalyanams are to be organized by TTD in a grand manner in Prayagraj

ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు
అదేవిధంగా జనవరి 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, టిటిడి విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు చేయాలని సూచించారు. శ్రీవారి భక్తులకు ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను సమకూర్చుకోవాల న్నారు. ప్రయాగ్ రాజ్ లో టిటిడి చేపడుతున్న రోజువారి శ్రీవారి కైంకర్యాలు, సౌకర్యాలను వర్చువల్ ద్వారా టిటిడి ఈవోకు టిటిడి అధికారులు నివేదించారు. శ్రీవారికి రోజువారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరుగుతున్న సేవలను వివరించారు.

బ్రేక్ దర్శనం రద్దు
శ్రీవారి నమూనా ఆలయానికి రోజువారి భక్తులు ఎంత మంది వస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్ యాలు చేపడుతున్నారు, టిటిడి సిబ్బందికి ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులను ఈవో అడిగి తెలుసుకున్నారు. ఇటు తిరుమలలో జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నం దున ఎస్ఎస్డీ టోకెన్లపై టిటిడి ఈవో సమీక్షించారు. జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయరు. వారు సర్వదర్శనం క్యూ లైన్‌లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసు కోవాల్సి ఉంటుంది. జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయరు. అదేవిధంగా, జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఈ కారణంగా జనవరి 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించటం లేదని టీటీడీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+