ఈ నెల 5 నుంచి ఒంటిమిట్ట ఆలయంలో
Tirumala: కడప జిల్లా ఒంటిమిట్టలో గల చారిత్రాత్మక శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 5వ తేదీన మహా సంప్రోక్షణ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న జీర్ణోదరణ పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇటీవలే టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు స్వయంగా పరిశీలించారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం గత ఏడాది సెప్టెంబరు 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం జరిగిన విషయం తెలిసిందే.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆలయంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనులను పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టనుంది టీటీడీ. విష్వక్సేనులవారి ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమంతో ఈ పనులకు అంకురార్పణం చేయనున్నారు టీటీడీ అర్చకులు.
మాహా సంప్రోక్షణ సందర్భంగా 6వ తేదీ ఉదయం 7:30 గంటలకు భగవత్ పుణ్యాహం, అగ్ని మథనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ, చక్రబ్జా మండల, పరివార కుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమాలు, శ్రీ మద్రామాయణ హవన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.
సాయంత్రం 5:30 గంటలకు చతుస్థానార్చనం, సహస్ర కళాశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమం, పూర్ణాహుతి శాత్తుమొర జరగనుంది. 7వ తేదీ ఉదయం 8 గంటలకు సహస్ర కలశావాహన, రామతారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమం, విమాన గోపురం ఛాయా స్నపనము, పూర్ణాహుతి నిర్వహిస్తారు.
సాయంత్రం 5.30 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చన, మూర్తి హోమం చేపడతారు. 8న తెల్లవారు జామున 6 గంటలకు చతుస్థానార్చనం, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, సహస్రకలశాది దేవత హోమం, సహస్ర కలశాభిషేకం, పూర్ణాహుతి జరుగునుంది.
సాయంత్రం 6 గంటలకు కళాపకర్షణ, శయ్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వన్యాస హోమం, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం నిర్వహించనున్నారు. 9న భగవత్ పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీ మద్రామాయణ హోమం, పంచసూక్త పవమాన హోమాలను జరుపుతారు.
ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10:15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను శ్రీకోదండ రామస్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications