సీఎం జగన్ అండగా నిలిచారు- రాజకీయాలు చేయద్దు..!!
కొవ్వూరులో దళిత యువకుడు మహేంద్ర ఉదంతం లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహేంద్ర కుటుంబ సభ్యులు ఈ ఘటన పైన స్పందించారు. ప్రభుత్వం స్పందించిన తీరుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మహేంద్ర ఉదంతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని వారు విజ్ఞప్తిచేశారు. ఈ ఘటన తెలిసినవెంటనే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, తమ కుటుంబానికి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
కొవ్వూరులో దళిత యువుడు మహేంద్ర ఉదంతం పైన టీడీపీ చేసిన రాజకీయం బూమ్ రాంగ్ అయింది. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. హోం మంత్రి తానేటి వనిత పైన ఆరోపణలు గుప్పించారు. హోంమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఈ కేసు యోక్క దర్యాప్తుకు సహకరించాలని మాజీ మంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేసారు. ఇక, ఈ విషయం పైన ఇప్పుడు స్పందించిన మహేంద్ర కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా మంత్రి మేరుగ నాగార్జునను ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు వారు వచ్చి తమ కుటుంబానికి ఓదార్పునిచ్చారన్నారు.

కొవ్వూరులో దళిత యువకుడు మహేంద్ర ఉదంతం ప్రభుత్వం స్పందించిన తీరుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు..!#YSJagan #APGovt #Kovvuru #Mahendra #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/Lq8w8YeDc7
— oneindiatelugu (@oneindiatelugu) November 19, 2023
మహేంద్ర కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం చేశారన్నారు. ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించికూడా ఇస్తామని, ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబం వెన్నంటి ఉన్న జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మహేంద్ర ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దయచేసి రాజకీయాలు చేయొద్దని మహేంద్ర కుటుంబ సభ్యులు విజ్క్షప్తిచేశారు.












Click it and Unblock the Notifications