బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు కూతురు సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో వివిధరకాల పోస్టులు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. తన తండ్రి మహేష్ బాబుకు తీసిపోని విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తరుచుగా తాను నృత్యం చేసే వీడియోలతోపాటు అందమైన చిత్రాలను షేర్ చేస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో తనకంటూ భారీసంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.
సర్కారువారి పాట సినిమా ప్రమోషన్ కోసం తీసిన పాటలో అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. ఈ ఒక్క పాటతో తండ్రికి తగ్గ కుమార్తె అంటూ పేరు తెచ్చుకుంది. అసలు విషయానికొస్తే మహేష్ బాబు సినిమాలతోపాటు బ్రాండ్ అంబాసిడర్ గా పలు సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారు.

తాజాగా సితార కూడా తండ్రి బాటలోనే బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ప్రముఖ జ్యూవెలరీ సంస్థ పీఎంజే తన బ్రాండ్ అంబాసిడర్ గా సితారను నియమించుకుంది. తాజాగా ఈ జ్యువెలరీ బ్రాండ్ తన ప్రమోషనల్ యాడ్ ఫోటో షూట్ ను సితారతో చేసింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో సితార షేర్ చేసింది. అతి త్వరలోనే ఈ ప్రకటన బయటకు రాబోతోంది.
ఈ యాడ్ లో నటించినందుకు సితారకు పీఎంజే జ్యువెలరీస్ సంస్థ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు, నమ్రతతో కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది. ఇప్పుడు సొంతంగా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. యూట్యూబ్, ఇన్ స్టా ద్వారా డబ్బు సంపాదిస్తున్న సితార ఇప్పుడు నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తద్వారా ఆదాయం కూడా భారీగానే రాబోతోంది. ఒకరకంగా రికార్డ్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ ఘట్టమనేని నట వారసురాలు ఎన్ని యాడ్లు చేస్తుందో? ఇంకెంత సంపాదిస్తుందో? చూడాలి












Click it and Unblock the Notifications