బుర్రిపాలెం దత్తత కోసం 'శ్రీమంతుడు' అర్జీ, బృందాలతో మహేష్ ఇంటింటి సర్వే
గుంటూరు: ప్రముఖ సినీ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవడంలో తొలి అడుగు వేశారు. తన తండ్రి కృష్ణ సొంతూరు అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేష్ బాబు కొద్ది రోజుల క్రితం చెప్పారు.
అందుకు గానూ, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అర్జీ పెట్టుకున్నారు. మహేష్ బాబు దత్తత అంశంపై ఇంటర్నెట్లో అర్జీ పూర్తి చేశారని తెనాలి ఎంపీడీవో చెప్పారు. గ్రామ అవసరాలను గుర్తించేందుకు ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయిస్తున్నారన్నారు.

పన్నెండు అంశాల ప్రాతిపదికన గ్రామ సమస్యలను గుర్తిస్తున్నారని చెప్పారు. అలాగే, వనరుల అభివృద్ధి పైన సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. మహేష్ బాబు ఏపీలో ఓ గ్రామాన్ని, తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
మహేష్ బాబు సోదరి, ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి గల్లా పద్మావతి కూడా ఇప్పటికే తెనాలి మండలంలోని కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. బుర్రిపాలెం హీరో కృష్ణ స్వగ్రామం కాగా, కంచర్లపాలెం మహేష్ బాబు అమ్మమ్మ ఊరు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications