అమరావతిలో 'రియల్' బిజినెస్: 'రామకృష్ణ'కు మహేష్ అంబాసిడర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నియమించారు. ఆ తర్వాత పనామా పేపర్ల నేపథ్యంలో పునరాలోచనలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. అది వేరే విషయం.

అయితే, రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ వద్ద రామకృష్ణ హౌసింగ్ ప్రయివేట్ లిమిటెండ్ సంస్థ చేపడుతున్న రామకృష్ణ వెనూజియా ప్రాజెక్టు బ్రోచర్‌ను, నమూనా భవనాల డిజైన్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడారు. రామకృష్ణ వెనుజియా ప్రాజెక్టుతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నానని మహేష్ బాబు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం చేసిన యాడ్ తనకు బాగా నచ్చిందన్నారు. విజయవాడ తనకు చాలా ఇష్టమైన నగరమని చెప్పారు.

అయితే, దీనిపై చర్చ జరుగుతోంది. బుర్రిపాలెం వచ్చిన మహేష్ బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించడం అక్కడి ప్రజల్లో ఆనందాన్ని ముంచెత్తింది.

Mahesh Babu New Stylish Ad on Ramakrishna Venuzia

నాగార్జున యూనివర్సిటీ వెనుక భాగంలో ఉన్న కాజ గ్రామంలో వెనుజియా పేరుతో గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నారు. 32 అంతస్తుల ఈ నిర్మాణాలకు గతంలో అనుమతి రాలేదన్నారని, కానీ ఇప్పుడు వచ్చినట్లుగా ఉందని అంటున్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో 45 ఎకరాల్లో 25 ట్వర్లు నిర్మించనున్నారు. మొత్తం 4800 ప్టాట్లు వస్తాయని చెప్పారు.

ఈ వెంచర్‌కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని అనిల్ సుంకర ఒకటికి రెండుసార్లు ప్రకటించారు. మహేష్ బాబుకు యథావిధిగా శుభాకాంక్షలు కూడా చెప్పారు.

ఆయన బావ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ముళ్లపూడి నరేంద్ర కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ అంబాసిడర్‌గా వచ్చారంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+