తొలి అడుగు: మహేష్ దత్తత గ్రామంలో సందడి చేయనున్న నమ్రత, కుటుంబ సభ్యులు

అమరావతి: ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామాన్ని నటుడు మహేష్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గ్రామంలో అభివృద్ధి పరంగా తొలి అడుగు వేయనున్నారు. బుర్రిపాలెం గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు, గ్రామస్థుల అవసరాలపై ఒక అవగాహనకు వచ్చి అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేశారు.

ఈ క్రమంలో గ్రామంలో పర్యటించేందుకు మహేష్‌ బాబు సతీమణి నమ్రత, ఆయన సోదరి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ సతీమణి పద్మావతి గురువారం వస్తున్నారు. వీరితో పాటు మహేష్ బాబు కుమారుడు గౌతమ్‌కృష్ణ, కుమార్తె సితార కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

గురువారం బుర్రిపాలెం గ్రామానికి చేరుకుని గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి పనులపై వీరు సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో గుంటూరు జిల్లాకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. గ్రామస్తుల సూచనల మేరకు బుర్రిపాలెం అభివృద్ధికి ఒక ప్రణాళికను మహే‌ష్ బాబు ముందు ఉంచనున్నారు.

 Mahesh Babu wife namrata to visit burripalem village in Andhra Pradesh

ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబు తన దత్తత గ్రామమైన బుర్రిపాలెం అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలపై కుటుంబ సభ్యులను పంపి వారి ద్వారా వివరాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల ద్వారా మహేష్ బాబు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు ఎల్‌ఈడీ వీధి లైట్ల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నారు. వీటిపై గ్రామస్తులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

మహేష్ బాబు కుటుంబ సభ్యులు గ్రామానికి రానున్నారనే సమాచారంతో బుర్రిపాలెంలో సందడి నెలకొంది. ఇదే సమయంలో ఎంపీ గల్లా జయదేవ్‌ సతీమణి పద్మావతి దత్తత తీసుకున్న కంచర్లపాలెం గ్రామంలో రూ.23 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

 Mahesh Babu wife namrata to visit burripalem village in Andhra Pradesh

గురువారం మొత్తం బుర్రిపాలెం గ్రామంలోనే నమ్రత, పద్మావతి, ఇతర కుటుంబ సభ్యులు గడపనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బుర్రిపాలెంకు రానున్న మహేష్ కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 3.30 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

అనంతరం బుర్రిపాలెం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మమేకమై వారి అవసరాలు తెలుసుకుంటారు. గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌, పిహెచ్‌సీలను కూడా సందర్శిస్తారని ఎంపీ జయదేవ్‌ కార్యాలయ ప్రతినిధి మంగళవారం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+