జగన్, పవన్‌ల మౌనమెందుకు, బాబు అలా చేయాల్సిందే: మహేష్ కత్తి
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం శానససభలో ప్రతిపాదించిన బడ్జెట్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి ప్రతిస్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర నాయకులను ప్రశ్నంచారు.
Recommended Video

రాజ్యసభ సభ్యులను అభినందిస్తూ ఆయన ముఖ్యమంత్ర నారా చంద్రబాబు నాయుడిపై, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై, వైయస్సార్ కాంగ్రెసు చీఫ్ వైయస్ జగన్‌పై వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్, జగన్‌లపై ఇలా..
కేంద్ర బడ్జెట్‌పై పవన్ కల్యాణ్, జగన్ ఎందుకు వహిస్తున్నారని మహేష్ కత్తి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టంపై వారిద్దరు ఇప్పటి వరకు మాట్లాడని విషయం తెలిసిందే.

కేంద్రబాబుని కాదని నిరూపించుకోవాలి...
చంద్రబాబు నాయుడు తాను కేంద్రబాబుని కాదని నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చిందని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టంపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. అయితే, మహేష్ కత్తి ఆయన నుంచి తీవ్రమైన చర్యను ఆశిస్తున్నారని అనుకోవాలి.

రాజ్యసభ సభ్యులకు కత్తి అభినందన
కనీసం రాజ్యసభలో అయినా మనోళ్లు నోరు విప్పారని మహేష్ కత్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజ్యసభలో కెవిపి రామచందర్ రావు సహా మిగతా కొంత మంది ఎపి పార్లమెంటు సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర అసంతృప్తి
అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications