AP Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్-ఇకపై ప్రోత్సాహకంగా..!
ఏపీలో ఉద్యోగులకు (ap employees) మరో కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రభుత్వ శాఖల్లో పనితీరుతో సంబంధం లేకుండా సాగిపోతున్న ఉద్యోగుల జీవన విధానాన్ని మార్చేందుకు ఈ ప్లాన్ చేస్తోంది. ఇవాళ దీనిపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వీటి ప్రకారం ఇకపై మంచి పనితీరు కనబర్చే ఉద్యోగులకు పలు ప్రయోజనాలు అందబోతున్నాయి. అలాగే పనితీరు బాగోలేకపోతే ఏం చేయాలో కూడా చంద్రబాబు సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం.. ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా పని చేయాలని సీఎం చంద్రబాబు ఇవాళ ఆదేశించారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తున్న క్రమంలో పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేయడంతోపాటు, బాగా పని చేస్తున్న వారిని గుర్తించి ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో చక్కగా పని చేస్తూ, ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రొత్సహిస్తే బాగుంటుందంటూ సీఎం చేసిన సీఎం సూచనపై పలువురు అధికారులు బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

బాగా పని చేసే ఉద్యోగులకు ఈ తరహా అభినందించడం ఇదే తొలిసారి అవుతుందని అధికారులు చెప్పారు. ఈ రకమైన విధానం వల్ల ఉద్యోగుల్లో పోటీతత్వం పెరుగుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. బాగా పని చేస్తున్న ఉద్యోగులను గుర్తించడంతో పాటు వారికి అభినందన లేఖలు పంపాలని చంద్రబాబు ఆదేశించారు. ఓ వైపు పని తీరు మదింపు చేస్తూనే.. మరోవైపు ప్రతి నెల బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అభినందన లేఖ పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా, వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications