కేసీఆర్‌నూ కలుస్తా, అమరావతి బాగుంది: బాబును కలిసిన నటుడు సురేష్ గోపీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మలయాళ నటుడు సురేష్ గోపీ శుక్రవారం సచివాలయంలో కలిశారు. కేరళలో జరిగే జాతీయ బనానా ఫెస్టివల్‌కు ఏపీ సీఎంను ఆహ్వానించారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మలయాళ నటుడు సురేష్ గోపీ శుక్రవారం సచివాలయంలో కలిశారు. కేరళలో జరిగే జాతీయ బనానా ఫెస్టివల్‌కు ఏపీ సీఎంను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సురేష్ గోపి మాట్లాడారు. 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు బనానా ఫెస్టివల్ తన సొంత గ్రామం త్రివేండ్రంలో జరుగుతున్నందున చంద్రబాబును ఆహ్వానించినట్లు చెప్పారు.

ఈ ఫెస్టివల్‌కు జాతీయ స్థాయిలో విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అరటి రైతులు పాల్గొంటారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామన్నారు.
బనానా ఫెస్టివల్‌లో 457 రకాల అరటి ఉత్పత్తులు ప్రదర్శిస్తారని వెల్లడించారు. మొదటిసారిగా అమరావతికి రావడం చాలా ఆనందంగా ఉందని, అమరావతి చూడటానికి ప్రకృతి వనంలా ఉందన్నారు.












Click it and Unblock the Notifications