వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల సొమ్ముతో వైసీపీ నేత జల్సా-సినిమాలు..రాజకీయాల్లో పెట్టుబడి :ఇప్పుడు జైళ్లో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ అధికార పార్టీకి చెందిన నేత పైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. విశాఖకు చెందిన వెల్ఫేర్ గ్రూపు సంస్థల అధినేత.. తాజాగా నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర వైద్య -మౌళిక వసతుల డెవలప్ మెంట్ సంస్థ ఛైర్మన్ మళ్ల విజయ ప్రసాద్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసారు. వెల్ఫేర్ ప్రయివేట్ లిమిటడ్.. వెల్ఫేర్ బిల్డింగ్స్ పేరుతో వ్యాపారాలు చేసారు. కోట్లాది రూపాయాల అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే విషయం పైన విచారణ చేసిన ఒడిశా పోలీసులు ఆయన పైన కేసుల నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా..జైలుకు తరలించారు.

Anasuya Bharadwaj :చీరలో కూడా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అనసూయ.. బ్యూటీఫుల్ ఫొటోస్

వసూలు చేసిన డబ్బు సినిమాలు-రాజకీయాల్లో

వసూలు చేసిన డబ్బు సినిమాలు-రాజకీయాల్లో

విజయప్రసాద్ ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును రాజకీయాలు..సినిమా రంగాలతో పాటుగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా తేల్చారు. ఆయనకు సహకరించిన వారెవరు..ఒడిశాలోని రాజకీయా నేతలతో విజయ్ ప్రసాద్ సంబంధాలు ఏంటనే దాని పైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒడిశా పోలీసులు విజయ్ ప్రసాద్ ను అరెస్ట్ చేయటంతో మరి కొంత మంది బాధితులు ముందుకు వస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్, భువనేశ్వర్, నయాగఢ్ వంటి ప్రాంతాల్లో విజయ్ ప్రసాద్ తన వ్యాపార కార్యాలయాలను ఏర్పాటు చేసారు.

purvimundada: వామ్మో ఏమిటి ఈ అందం ... టాప్ లెస్ ఫొటోలతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ (ఫొటోస్)purvimundada: వామ్మో ఏమిటి ఈ అందం ... టాప్ లెస్ ఫొటోలతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ (ఫొటోస్)

కోట్లాది రూపాయాల వసూలు..కార్యాలయాల మూసివేత

కోట్లాది రూపాయాల వసూలు..కార్యాలయాల మూసివేత

ప్రజల నుంచి కోట్ల రూపాయాలను వసూలు చేసారు. తిరిగి ఎవరికీ చెల్లించలేదని ఫిర్యాదులు దాఖలయ్యాయి. అయిదేళ్లలో మూడొంతులు..మూడేళ్లలో రెండు రెట్ల డబ్బులు ఇస్తామని ప్రజల నుంచి కోట్లాది రూపాయాలు వసూలు చేసి రాత్రికి రాత్రి కార్యాలయాలు మూసివేసినట్లు ఒడిశా పోలీసులు తేల్చారు. ఒడిశా ప్రాంతంలో తమను నమ్మి డబ్బులు కట్టిన వారికి విశాఖ ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేసారు. వాయిదా పద్దతుల్లో డబ్బులు కట్టిన వారు ఇంటి స్థలాలు తీసుకోపోతే..వారికి కట్టిన మొత్తం వెనక్కు ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులో

వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులో

2009-2014 మధ్య కాలంలో ఒడిశాలో సంస్థ పేరుతో అనేక ప్రాంతాల్లో కార్యాలయాలు ప్రారంభించారు. తొలుత లక్షల్లో మోసం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదులు రాగా, తాజాగా అవి కోట్లాది రూపాయాలు మోసం చేసినట్లుగా తేలింది. విజయ్ ప్రసాద్ తో పాటుగా మరో ఇద్దరిని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసారు. వారిని జైలుకు తరలించారు. ఇక, రాజకీయంగా వైసీపీలో కొనసాగుతన్న విజయ్ ప్రసాద్ విశాఖ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఒడిశా జైలులో విజయ్ ప్రసాద్

ఒడిశా జైలులో విజయ్ ప్రసాద్

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక, ఇప్పుడు ఆయన పైన కేసులు నమోదు కావటం..జైలుకు వెళ్లటం.. సామాన్యుల నుంచి ఫిర్యాదులు రావటంతో రాజకీయంగా ఆయన పైన పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. విజయ్ ప్రసాద్ ప్రస్తుతం ఒడిశాలోని జైల్లో ఉన్నారు. ఈ వ్యవహారం పైన వైసీపీ నేతలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

English summary
YCP leader Malla Vijaya Prasad Arrested by Odisha police in cheating Case. Vijaya prasad worked as congress mla and Recently he got nominated post in ycp govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X