ఈవీఎం ప్రస్తావన..చంద్రబాబును లాగిన కాంగ్రెస్
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పలువురు నేతలు ఈవీఎం గురించి ప్రస్తావించారు. ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ప్రస్తావనకు తెచ్చారు. ఈవీఎల పనితీరును జగన్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి,, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని జగన్ కోరారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఈవీఎంలు వద్దని పునర్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన 'సంవిధాన్ రక్షక్ అభియాన్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పేపర్లే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని వెల్లడించారు. బీజేపీ రాజ్యాంగాన్ని పొగడుతూనే లోలోపల వారు రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వానికి మెజార్టీ లేదని అది మైనార్టీ ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు , నితిష్ కుమార్ మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నదని వారు మద్దతు ఉపసంహరించుకుంటే మోదీ ప్రభుత్వం పడిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications