మమతా బెనర్జీకి మంగళగిరి చేనేత చీరలు
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా చేనేత చీరలపై మనసు పారేసుకున్నారు. నూలుతో తయారైన తెల్లని రంగు అంచు ఉన్న చీరలనే ఆమె ధరిస్తుంటారు. దీంతో చేనేత మగ్గంపై తయారైన చీరలు కావాలని మమతా బెనర్జీ కోరారు.

దీదీ కావాలని అడగడటంతో మంగళగిరి చేనేత మగ్గంపై వాటిని ప్రత్యేకంగా తయారు చేయించారని తెలుస్తోంది. తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి రంగు అంచులతో చేనేత కార్మికులు కొన్ని చీరలు తయారు చేశారు.
సుమారు 50 చీరలు పశ్చిమ బెంగాల్‌కు పంపుతున్నారని సమాచారం. మరో 50 చీరలకు ఆర్డరు ఇచ్చారని, వచ్చేవారంలో వాటిని పంపుతామని చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు చెప్పారు.












Click it and Unblock the Notifications