మహిళ అనుమానాస్పద మృతి: తండ్రే కొట్టిచంపాడన్న ఐదేళ్ల కొడుకు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు భార్యను కొట్టిచంపాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పెద్దసోడు మండలానికి చెందిన మధు, భార్య ప్రవళిక(27), ఇద్దరు పిల్లలు దినేష్‌(5), కాంచనతో కలిసి శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీ రాజీవ్‌గృహకల్పలోని 62 అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నెంబర్‌ 18లో ఉంటున్నా డు.

మధు ఐడీఏ బొల్లారంలోని ఏపీ టైర్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మధు, ప్రవళికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అత్తింటి వారు కట్నం కింద 30తులాల బంగారం.. రూ.5లక్షలు ఇచ్చారు. నిరుటి నుంచి అదనపు కట్నం తీసుకు రమ్మని మధు తన భార్యను వేధించడం మొదలెట్టాడు.

కాగా, శనివారం రాత్రి ఆ దంపతుల మధ్య కట్నం విషయంలో గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన మధు భార్యను కొట్టి చంపి ఫ్యాన్‌కు వెళ్లడాదీశాడు. ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కల వారు చూసి చందానగర్‌ పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సైదులు తెలిపారు. కాగా, ప్రవళిక మృతదేహంపై పడి ‘లే అమ్మా' అంటూ మూడేళ్ల చిన్నారి కాంచన ఏడ్చిన తీరు స్థానికులను కదిలించింది. అక్కడికి వచ్చిన చలించిపోయారు.

నాన్న కొట్టడం వల్లే అమ్మ చనిపోయింది

శుక్రవారం రాత్రి నుంచి అమ్మా నాన్న గొడవపడ్డారని కొడుకు దినేష్ తెలిపాడు. ‘పలుమార్లు డాడీ అమ్మను కొట్డాడు.. అమ్మ కిందపడింది. అమ్మ చెంపపై డాడీ గట్టిగా కొట్టి గోడకు నొక్కడంతో ఆమె తల నుం చి రక్తం వచ్చింది.. అమ్మ కింద పడి చనిపోయింది' అని ఐదేళ్ల కుమారుడు దినేష్‌ తెలిపాడు.

పిల్లలు దినేష్, కాంచన

పిల్లలు దినేష్, కాంచన

హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు భార్యను కొట్టిచంపాడు.

మృతురాలు ప్రవళిక

మృతురాలు ప్రవళిక

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పెద్దసోడు మండలానికి చెందిన మధు, భార్య ప్రవళిక(27), ఇద్దరు పిల్లలు దినేష్‌(5), కాంచనతో కలిసి శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీ రాజీవ్‌ గృహకల్పలోని 62 అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నెంబర్‌ 18లో ఉంటున్నా డు.

ఉరివేసుకున్నట్లు చిత్రీకరణ

ఉరివేసుకున్నట్లు చిత్రీకరణ

మధు ఐడీఏ బొల్లారంలోని ఏపీ టైర్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మధు, ప్రవళికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.

ఘటనా స్థలంలో..

ఘటనా స్థలంలో..

అత్తింటి వారు కట్నం కింద 30తులాల బంగారం.. రూ.5లక్షలు ఇచ్చారు. నిరుటి నుంచి అదనపు కట్నం తీసుకు రమ్మని మధు తన భార్యను వేధించడం మొదలెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+