పనుందని ఒంటరిగా తీసుకెళ్లి మహిళపై అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: పని ఉందంటూ ఓ మహిళా కార్మికురాలిని తన వెంట తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మేస్త్రీపై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాం నగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ (30) భవన నిర్మాణాల్లో దినసరికూలీగా పనిచేస్తుంది.
అందులో భాగంగా ఈ నెల 4వల తేదీన దాయారా మార్కెట్లోని లేబర్ అడ్డాలో పని కోసం ఆమె నిల్చోని ఉండగా చిలకలగూడ అమన్ బస్తీకి చెందిన మేస్త్రీ రవీందర్ లేబర్ అడ్డాకు వచ్చి తమ వద్ద పని ఉందని చెప్పి ఆమెను తన వాహనంపై తీసుకెళ్లి నిర్మాణంలో ఉన్న మూడు నాలుగు భవనాల వద్దకు తీసుకెళ్లాడు.

చివరగా గోల్కోండ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలోని నాల్గవ అంతస్తుకు తీసుకెళ్లి ఆమెపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె అక్కడినుంచి తప్పించుకుంది. ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన ఘటనపై భర్తకు వివరించింది.
దీంతో బాధితురాలి భర్త శుక్రవారం సాయంత్రం ముషీరాబాద్ పోలీసులకు మేస్త్రీ రవీందర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి మేస్త్రీ రవీందర్‌పై ఐపీసీ 354 బి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications