ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే (ఫోటోలు)

రాజమండ్రి: కోరుకొండ రామచంద్రరావుపేటకు చెందిన ఏడిద ఆనంద్ కుమార్ గురువారం మధ్యాహ్నం పదిహేను నిమిషాల సమయంలో ముగ్గురిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆనంద్ కుమార్ అసలు ఉన్మాదిగా ఎలా మారాడో చూద్దాం. ఆనంద్ కుమార్ పాత నేరస్థుడు. గతంలో అన్నతో కలిసి రాజమండ్రిలో గొడ్డు మాంసం వ్యాపారం చేసే ఒక మహిళను పట్టపగల హత్య చేశారు.

ఏడాది క్రితం ఆనంద్ అన్న విడుదలయ్యాడు. ఆ తర్వాత అతను తన వృత్తి చేసుకుంటూ భార్యాపిల్లలతో మామూలు జీవితం గడుపుతున్నాడు. ఇటీవలే నాలుగు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన ఆనంద్ అప్పటి నుంచి పనీ పాటా లేకుండా గొడవలు చేస్తూ అల్లరి చిల్లరిగా తిరేవాడు. ఈ క్రమంలో అన్న కుటుంబ సభ్యులతో పాటు కులపెద్దలు అతడిని మందలించారు. బహుశా అది కూడా మనసులో పెట్టుకుని ఉండవచ్చు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఒక ఖైదీ తల పగలకొట్టడంతో అతడికి మానసిక వైద్యం కూడా చేయించినట్టు సమాచారం. ఒక వివాదంలో తన అన్నకూతురు ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు కూడా కాల్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. కానీ ఎంపీటీసీ సభ్యురాలి కుటుంబంతో గొడవలేమీ లేవంటున్నారు.

ఆమె మాట అక్కడ చెల్లుబాటు కావడంతో ఇవన్నీ మనసులో పెట్టుకుని, ఆనంద్ ఆకస్మికంగా జరిగిన సంఘటనలో రెచ్చిపోయి ఈ హత్యలు చేశాడనే ప్రచారం ఉంది. ఇలా తరుముతుండగా స్థానిక యువకులు మరో నలుగురిపై దాడి చేయబోయాడు. అయితే పేటలోని యువకులు కొందరు పట్టుకుని ఆ ఉన్మాదిని పోలీసులకు అప్పగించారు.

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

ఆనంద్ కుమార్ పదేళ్లు జైలులో ఉన్నప్పుడు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాలు విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలిసింది. అయితే పదేళ్ల జైలు శిక్ష అనంతరం నాలుగు నెలల క్రితం కోరుకొండకు వచ్చాడు. ఆనంద్ కుమార్‌కు ఇద్దరు అన్నలు. ఒక అన్న గతంలో చనిపోయాడు. మరో అన్న భార్యను నిన్న జరిగిన ఘటనలో హత్య చేశాడు.

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

ఆనంద్ కుమార్ రోడ్లపై పడుకొనే పశువులను అర్ధరాత్రి దాటిన తర్వాత మెడకింద కోసి చంపేవాడని, అనంతరం వాటిని ఆనవాళ్లు తెలియకుండా తోలు లాగేసేవాడని, మురసటి రోజు వాటిని అమ్మసేవాడని కోరుకొండలో జనం చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే కోరుకొండలో గురువారం జరిగిన దారుణ హత్యలు సంఘటనలో మృతులైన వారి కుటుంబాలన్నీ దళిత నిరుపేదలే.

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

అందరూ తాతల నుంచి వస్తున్న కులవృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కోరుకొండ ఆర్టీసీ బస్టాండ్‌కు అత్యంత సమీపంలో రామచంద్రరావుపేటలో ఈ సంఘటన జరిగింది. మృతుడు గెడ్డం నాగభూషణం ఫోటోలకు అద్దాలు కట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతురాలు అయిన ఎంపీటీసీ సభ్యులు ఖండవల్లి కుమారి, ఆమె భర్త కూడా కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు.

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

ఎందుకిలా?: రాజమండ్రి ఉన్మాది ఆనంద్‌ది తొలినుంచి నేర చరిత్రే

అదేవిధంగా స్వయాన అన్న భార్య అయిన మృతురాలు ఏడిద లలిత కూడా నిరుపేద కుటుంబరాలే. ఊహించని అనూహ్య పరిణామాల మధ్య జరిగిన ఈ హత్యలు వల్ల మొత్తం రామచంద్రరావుపేట అంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చుట్టుపక్కలవారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దారుణ సంఘటనతో మండలం అంతా దిగ్భ్రాంతికి గురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+