భార్యంటే ప్రాణం, ఆమెకు వేరే వ్యక్తితో లింక్: భర్త ఆత్మహత్య
అనంతపురం/ నెల్లూరు: భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తలుపుల మంలం చంద్రనాయక్ తండాలో ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన జావిలా నాయక్ (38) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.
జావిలాకు భార్య లక్ష్మీదేవి అంటే ప్రాణం. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలియడంతో తట్టుకోలేక జావిలా నాయక్ సోమవారం రాత్రి పొలంలో పురుగుల మందు తాగి మరణించాడు. అతని మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నెల్లూరులోని ఓ లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట మండలం జగదేవిపేటకు చెందిన అత్తులూరి ప్రభాకర్ నాయుడు (55) ఎవరెస్ట్ లాడ్జిలో ఈ నెల 2వ తేదీన గది అద్దెకు తీసుకున్నాడు. అయితే సోమవారం నుంచి అతను ఉంటున్న గది తలుపులు తెరుచుకోలేదు.
అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది మంగళవారంనాడు తలుపులు తెరిచి చూశారు. వారికి ప్రభాకర్ నాయుడు మరణించి ఉన్న దృశ్యం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications