ఆశ్చర్యం: చనిపోయాడని వైద్యులు తేల్చారు... పాడెపై నుంచి పైకి లేచాడు
వరంగల్: చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి రావడంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మరిపెట మండలం జీన్యాతండాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే జీన్యాతండాకు చెందిన రైతు బానోతు ధర్మ తన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయంతో పూడిక తీయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు అతను చనిపోయాడని తేల్చడంతో.... కుటుంబ సభ్యులు విషాదంతో అతనిని తీసుకుని వెనుదిరిగారు. ధర్మ చనిపోయాడని తండాకు సమాచారం రావడంతో బంధువులు, కుటుంబసభ్యులు అతనికి పాడెను కూడా సిద్ధం చేశారు.
ఇంటికి తీసుకొచ్చిన సదరు వ్యక్తిపై పడుకోబెట్టి అతని చుట్టూ చేరిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. దీంతో ధర్మ ఒక్కసారిగా లేచి, ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించడంతో..... ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications