ఏపీలో కల్తీ మద్యం తాగి వైన్ షాపులోనే వ్యక్తి మృతి..?
ఆంధ్రప్రదేశ్, ఏలూరు నగరంలో చోటు చేసుకున్న ఓ అమానుష ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వైన్ షాపులోనే కుప్పకూలి మరణించినా, దాన్ని పట్టించుకోకుండా యథావిధిగా మద్యం అమ్మకాలు కొనసాగించడం మానవత్వానికే సవాలు విసిరింది.
ఏలూరులోని జీవీ మాల్ (GV Mall) వద్ద ఉన్న SR వైన్స్ షాపు (SR Wines) లో ఈ దారుణం జరిగింది. మద్యం సేవించిన ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లి, అక్కడే పడిపోయి మరణించాడు. మృతదేహం కళ్లముందే ఉన్నా, షాపు నిర్వహకులు గానీ, అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు.

ఈ షాకింగ్ ఘటనలో, ఆ మృతదేహం అక్కడే పడి ఉన్నప్పటికీ, షాపు నిర్వాహకులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగించారు. మద్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చిన వారు కూడా ఆ శవాన్ని చూసినా, ఏమీ జరగనట్టుగా మద్యం తీసుకుని వెళ్లిపోయారు.
చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎక్కడివాడు అనే వివరాలు తెలియరాలేదు. కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, గంటల తరబడి మృతదేహాన్ని అలాగే ఉంచడం ఈ ఘటనలోని అత్యంత దారుణమైన విషయం. ఈ అమానవీయ ఘటన, మద్యం వ్యాపారంలో నైతిక విలువల పతనాన్ని, సమాజంలో పెరిగిన ఉదాసీనతను కళ్లకు కట్టినట్టు చూపించింది.
ఏపీలో మద్యం తాగి.. వైన్ షాపులోనే వ్యక్తి మృతి..!#Liquor #ViralWatch #AndhraPradesh #Oneindia #OITelugu pic.twitter.com/OXMP6roNqY
— oneindiatelugu (@oneindiatelugu) October 9, 2025
ఈ విషయంపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు, వైన్ షాపు నిర్వాహకులపై ఏ కేసు నమోదు చేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.అయితే నకిలీ మద్యం తాగడం వల్లే వ్యక్తి మృతి చెందారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మృతికి కూడా ప్రభుత్వమే కారణమని విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications