రెండో పెళ్లి: ఫస్ట్ భార్య, కొడుకును నరికేశాడు (పిక్చర్స్)

హైదరాబాద్: తన రెండో పెళ్లిని రాద్దాంతం చేసి పరువు తీసిందన్న కోపంతో మొదటి భార్యను, కుమారుడిని ఓ భర్త హత్య చేసిన సంఘటన హైదరాబాదులోని నాగోల్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఎల్బీ నగర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... నాగోలులోని సాయినగర్‌లోని సాయిమధురమ్ అపార్టుమెంటులో విజయలక్ష్మి, కుమారుడు సాకేత్ నివసిస్తున్నారు. వీరి స్వగ్రామం నల్గొండ జిల్లాలోని నెమ్మని గ్రామం.

పదిహేడేళ్ల క్రితం సూర్యాపేట సమీపంలోని కుడకుడ గ్రామానికి చెందిన శశిధర్ రెడ్డితో వివాహం అయింది. నాలుగేళ్ల క్రితం వీరి నగరంలో స్థిరపడ్డారు. భర్త జల్సాగా తిరుగుతూ ఉన్న ఆస్తులన్ని అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్యకు తెలియకుండా ఏడు నెలల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి విజయలక్ష్మి సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కోర్టులో బెయిల్ తీసుకున్న భర్త మొదటి భార్యపై కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుండి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. కక్ష పెంచుకున్న శశిధర్.. భార్య, కొడుకును చంపేందుకు కుట్ర పన్నాడు. బుధవారం రాత్రి ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి విజయలక్ష్మి ఉండే ఫ్లాట్‌కు చేరుకున్నాడు. వాచ్‌మెన్ అడిగినా లోపలకు దూసుకెళ్లారు. బయటనే ఉన్న భార్య, కుమారుడి మెడను తల్వార్లతో నరికారు.

సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొన్నారు. విషయం తెలియడంతో ఇద్దరు కిరాయి వ్యక్తులు పరారయ్యారు. లోపల మరో కిరాయి నిందితుడు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇంట్లో రక్తం మడుగులో ఉన్న రెండు మృతదేహాల్ని పోలీసులు చూశారు. లోపలే దాక్కున్న శశిధర్ రెడ్డిపై తుపాకులరు ఎక్కు పెట్టారు. సిఐ రవీందర్ రెడ్డి రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆపై లొంగదీసుకున్నారు. అక్కడే ఉన్న విజయలక్ష్మి సోదరి సంధ్య నిర్ఘాంతపోయి పడిపోయింది. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విజయలక్ష్మి సోదరుడు సంతోష్ రెడ్డి కన్నీరుమున్నీరయ్యాడు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశాడు.

నాగోల్ 1

నాగోల్ 1

తన రెండో పెళ్లిని రాద్దాంతం చేసి పరువు తీసిందన్న కోపంతో ఓ భర్త తన మొదటి భార్యను, కొడుకును దారుణంగా హతమార్చిన సంఘటన నాగోల్‌లో జరిగింది.

నాగోల్ 2

నాగోల్ 2

సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొన్నారు. విషయం తెలియడంతో ఇద్దరు కిరాయి వ్యక్తులు పరారయ్యారు. లోపల మరో కిరాయి నిందితుడు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

నాగోల్ 3

నాగోల్ 3

తన రెండో పెళ్లిని రాద్దాంతం చేసి పరువు తీసిందన్న కోపంతో ఓ భర్త తన మొదటి భార్యను, కొడుకును దారుణంగా హతమార్చిన సంఘటన నాగోల్‌లో జరిగింది. హత్యకు గురైన సాకేత్.

నాగోల్ 4

నాగోల్ 4

తన రెండో పెళ్లిని రాద్దాంతం చేసి పరువు తీసిందన్న కోపంతో ఓ భర్త తన మొదటి భార్యను, కొడుకును దారుణంగా హతమార్చిన సంఘటన నాగోల్‌లో జరిగింది. హత్యకు గురైన విజయలక్ష్మి

నాగోల్ 5

నాగోల్ 5

శశిధర్ రెడ్డి బుధవారం రాత్రి ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి విజయలక్ష్మి ఉండే ఫ్లాట్‌కు చేరుకున్నాడు. వాచ్‌మెన్ అడిగినా లోపలకు దూసుకెళ్లారు. బయటనే ఉన్న భార్య, కుమారుడి మెడను తల్వార్లతో నరికారు.

నాగోల్ 6

నాగోల్ 6

శశిధర్ రెడ్డి బుధవారం రాత్రి ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి విజయలక్ష్మి ఉండే ఫ్లాట్‌కు చేరుకున్నాడు. వాచ్‌మెన్ అడిగినా లోపలకు దూసుకెళ్లారు. బయటనే ఉన్న భార్య, కుమారుడి మెడను తల్వార్లతో నరికారు.

నాగోల్ 7

నాగోల్ 7

శశిధర్ రెడ్డి బుధవారం రాత్రి ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి విజయలక్ష్మి ఉండే ఫ్లాట్‌కు చేరుకున్నాడు. వాచ్‌మెన్ అడిగినా లోపలకు దూసుకెళ్లారు. బయటనే ఉన్న భార్య, కుమారుడి మెడను తల్వార్లతో నరికారు.

నాగోల్ 8

నాగోల్ 8

సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొన్నారు. విషయం తెలియడంతో ఇద్దరు కిరాయి వ్యక్తులు పరారయ్యారు. లోపల మరో కిరాయి నిందితుడు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

నాగోల్ 9

నాగోల్ 9

ఇంట్లో రక్తం మడుగులో ఉన్న రెండు మృతదేహాల్ని పోలీసులు చూశారు. లోపలే దాక్కున్న శశిధర్ రెడ్డిపై తుపాకులరు ఎక్కు పెట్టారు. సిఐ రవీందర్ రెడ్డి రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆపై లొంగదీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+