తప్పిన పెను ప్రమాదం: ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తేసిన పిచ్చోడు!, 100క్యూసెక్కుల నీరు వృథా

Subscribe to Oneindia Telugu

విజయవాడ: నీటి పారుదల శాఖ అధికారుల అలసత్వం, ఓ మతి స్థిమితం లేని వ్యక్తి నిర్వాకంతో ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 100 క్యూసెక్కుల నీరు వృథా పోయింది.
మతిస్థిమితం లేని ఒక వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేటు ఎత్తివేయటంతో లక్షలాది గ్యాలన్ల నీరు వృథాగా దిగువకు ప్రవహించింది.

దీంతో గేట్లకు మరమ్మతులు చేస్తున్న ఇరిగేషన్ సిబ్బంది పరుగు పరుగున వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. అప్పటికే కనీసం 15 రోజుల పాటు రెండు నగరాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు సరిపడా నీరు వృథాగా పోయింది.

గేట్ల మరమ్మతుల కోసం సిబ్బంది గత కొంతకాలం నుండి బ్యారేజీపైనే ఉంటున్నారు. మంగళవారం 58వ ఖానాకి సంబంధించి మరమ్మతులు చేస్తూ గేటు తీసే ఉంచారు. సిబ్బంది టీ తాగటానికి బయటకు వెళ్లిన సమయంలో బంగారుబాబు అనే మతిస్థిమితం లేని వ్యక్తి లోపలికి చొరబడ్డాడు.

Man illegally lifts Prakasam Barrage gates, held

లోపల ఉన్న ఆకుపచ్చ స్విచ్ నొక్కటంతో గేటు ఒక్కసారిగా పైకి లేచి, నీరు దిగువకు ప్రహహించింది. ఆ సమయంలో కింద పనులు చేస్తున్న కొందరు కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఇది గమనించిన సిబ్బంది పరుగులు తీస్తూ లోపలికి ప్రవేశించి గేటును కిందకు దించి పరిస్థితి చక్కదిద్దారు.

మతిస్థిమితం లేని ఆ వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. అతడిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన బంగారు బాబు(40)గా గుర్తించారు. అతడికి మతిస్థిమితం లేదని పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది బయటకు వెళ్లే ముందు గేటు తాళం వేసుంటే ఇలా జరిగి ఉండేది కాదని వన్‌టౌన్ సిఐ దాసరి కాశీవిశ్వనాధ్ అన్నారు.

అయితే, తొలుత బంగారు బాబు మానసిక స్థితి సరిగా లేదని భావించినా.. ఆనకట్ట మెకానికల్‌ సిబ్బంది మాత్రం అతనికి వీటి గురించి ఎంతోకొంత అవగాహన ఉందని అనుమానిస్తున్నారు. మొత్తం బ్యారేజికి 70 గేట్లు ఉన్నాయి. ప్రతి ఏడు ఎనిమిది తలుపులకు ఒకచోట వాటివద్దకు వెళ్లేందుకు దారి ఉంటుంది.

ఆ దారికి తలుపులు, వాటికి తాళాలు ఉంటాయి. గేట్లు తెరిచేందుకు పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి. తొలుత కొన్ని గేట్లకు కలిపి ఒకే ఛేంజ్‌ ఓవర్‌ స్విచ్‌ ఉంటుంది. తర్వాత దశలో ప్రతి తలుపునకు స్విచ్‌ విడిగా ఉంటుంది. తొలుత ఛేంజ్‌ ఓవర్‌ స్విచ్‌ ఎక్కడుందో గమనించి ఆ స్విచ్‌ ఆన్‌ చేసి.. ఆ తర్వాత విడిగా తలుపులు తెరిచాడని చెబుతున్నారు. ఇదంతా మతి స్థిమితం లేనివారు చేయలేరని వారంటున్నారు.

తప్పిన పెను ప్రమాదం

అదృష్టవశాత్తు రెండు గేట్లు మాత్రమే ఎత్తివేయడం, అధికారులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. అప్పటికే అప్రాన్‌పై ఉంటున్న కార్మికుల సామగ్రి కొట్టుకుపోయాయి. అధికారులు లాకులను దించేయడంతో పాటు అక్కడే తిరుగుతున్న బంగారు బాబును అదుపులోకి తీసుకుని విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించారు. వారు నిందితుడిని వన్‌టౌన్‌ సీఐ కాశీవిశ్వనాథ్‌కు అప్పగించారు.

అతనిని విచారించిన పోలీసులు మతిస్థిమితం లేనందున అలా చేసి ఉంటాడని..మతిస్థిమితం ఉన్నది లేనిది వైద్య పరీక్షలలో తేలుతుందన్నారు. అతడి పూర్వ చరిత్ర గురించి విచారణ చేయమని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇరిగేషన్‌ విభాగం జేఈ రవికిరణ్‌ ఫిర్యాదు మేరకు నిందితుడిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Workers hired for maintenance works at Prakasam Barrage on Krishna river in Vijayawada on Tuesday afternoon were shocked to see water gushing out of the barrage downstream.
Please Wait while comments are loading...