ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెను తగులబెట్టాడు

Man kills ex lover in Kurnool district
కర్నూలు: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరులో దారుణం చోటుచేసుకుంది. వావిద్ అనే యువకుడు ఓ అమ్మాయిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

ఈ ప్రాంతానికి చెందిన శివలక్ష్మమ్మ అనే యువతి మంగళవార రాత్రి నుంచి కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి పట్టణ శివారు ప్రాంతంలో ఓ మృతదేహం కాలి పడివున్నట్టు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం చేరవేశారు.

దీంతో యువతి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని మృతదేహం వద్దకు వెళ్లగా ఆ శవం శివలక్ష్మదిగా గుర్తించారు. తనను ప్రేమించి వేరొకరిని పెళ్ళి చేసుకుంటోందన్న అక్కసుతోనే వావిద్ ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలుస్తోంది.

స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+