మాట్లాడుకుందాం రా!: ప్రేయసిని గొంతు కోసి చంపాడు
చిత్తూరు: ఓ యువకుడు ఓ యువతిని నమ్మించి హత్య చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమించాడు. కట్నకానుకలకు ఆశపడి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. నమ్మి మోస పోయిన యువతి తననే పెళ్లి చేసుకోవాలని నిలదీ యడంతో నమ్మించి ఓ చోటకు రప్పించి గొంతు కోసి హత్య చేశాడు.
ఈ సంఘటన ఆలస్యంగా శుక్రవారం చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో వెలుగుచూసింది. కార్వేటినగరం సీఐ మోహన్ అందుకు సంబంధించిన వివరాలను అందించారు. కార్వేటినగరం మండలంలోని గోపిశెట్టిపల్లె దళితవాడకు చెందిన మల్లిక(20) ను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు.
అయితే నారాయణవనంలో ఉన్న ఆ యువకుడి సమీప బంధువులు తమ అమ్మాయిని ఇచ్చి కట్నకానుకలతో వివాహం జరిపించడానికి అంగీకరించారు. దీంతో డబ్బు, నగలపై ఆశపడ్డ ఆ యువ కుడు మల్లికను వదిలించుకోవడానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న మల్లిక తనను పెళ్లి చేసుకోవాలని అతడి పై ఒత్తిడి తెచ్చింది.

మాట్లాడుదాం రమ్మని ఆ యువకుడు ఈ నెల 21 వ తేదీన గోపిశెట్టిపల్లె దళితవాడకు అరకిలోమీటరు దూరంలో ఉన్న ఓ మామిడితోటలోకి మల్లికను తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. తరువాత ఏమీ తెలియనట్లు ఊరిలో సంచరించాడు. కాగా, గురువారం నాడు మల్లిక తల్లి గుండమ్మ తమ కుమా ర్తె కనపడటం లేదని కార్వేటినగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శుక్రవారం మామిడితోటలో శవం పడి ఉందని తోట యజమాని దాము పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రాంతానికి సీఐ మోహన్, ఎస్‌ఐ రాజశేఖర్ వెళ్లి పరిశీలించారు. జాగిలాలను సైతం పిలిపించి పరిశీలింపజేశారు. ప్రస్తుతం ఆ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కార్వేటినగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications