అక్రమ సంబంధమనే అనుమానం: ప్రేయసిని చంపేసి పూడ్చి పెట్టాడు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గూడూరు మండలం అయ్యవారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ప్రియురాలు అపర్ణ (40)ను ధనుంజయ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.

జనవరి 25న జరిగిన ఈ హత్యోదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. అపర్ణ కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో హత్య తానే చేశానంటూ ధనుంజయ వీఆర్‌ఓ ఎదుట అంగీకరించాడు.

 Man kills lover in Nellore district

అపర్ణను పూడ్చిపెట్టిన స్థలం చూపించడంతో రెవెన్యూ, పోలీసులు కలిసి శవాన్ని బయటకు తీశారు. పంచనామా నిర్వహించి ధనుంజయను అదుపులోకి తీసుకున్నారు. అపర్ణకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం అయింది.

పదేళ్ల కిందట అపర్ణ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ధనుంజయతో కలిసి ఉంటోంది. అయితే ఇటీవల కాలంలో అపర్ణ వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని అనుమానంతో ధనుంజయ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+