వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు: ఆమె పిల్లలను చంపేశాడు

ఏలూరు: వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె పిల్లలను బలి తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా కిడ్నాప్‌నకు గురయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకు శవాలై కనిపించారు. బాబాయే వారి ప్రాణాలను తీశాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పిల్లలను చంపినవారిని తమకు అప్పగించాలంటూ గ్రామస్థులు పోలీస్‌ జీపును అడ్డుకున్నారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకరపు చిన్నారావు, మంగ దంపతుల కుమారులు ప్రశాంత్‌(10), విక్కీ(8) ఆదివారం ఉదయం పాలు తేవడానికి వెళ్లారు. అలా వెల్లినవారు ఇంటికి తిరిగిరాలేదు.

ఉదయం వెళ్లిన చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో సాయంత్రం వరకూ ఊరంతా వెతికి ఎక్కడా కనబడక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీ సులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇలా తేలింది...

ఇలా తేలింది...

ఇద్దరు పిల్లలను అదే గ్రామానికి చెందిన వరసకు బాబాయ్‌ అయిన కైకరపు రవిశేఖర్‌ ఆదివారం ఉదయం మోటార్‌ సైకిల్‌ పై ఎక్కించుకుని పోలవరం వైపునకు తీసుకెళ్లినట్టు దర్యాప్తులో తెలిసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఇద్దరిని ఇటుకలకోట వద్ద బ్రిడ్జి మీద నుంచి తోసేసినట్టు నిందితుడు విచారణలో పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం గాలించగా ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతదేహాలు ఇలా...

మృతదేహాలు ఇలా...

ఇటుకలకోట దగ్గర ప్రశాంత్‌, గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం కాలువ దగ్గర విక్కీ శవాలు తేలాయి. పిల్లలు మరణించినట్లు తెలియడంతో గ్రామస్థులంతా తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. నిందితుడు రవిశేఖర్‌ ఇంటి వద్దకు మహిళలు తరలివెళ్లి ఇంటిపై దాడి చేశారు. తలుపులు బద్దల కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి తండ్రి కాంతారావును జీపులో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మహిళలు జీపును అడ్డగించారు. పోలీసులు జీపును కదిలించడంతో ఆగ్రహానికి గురై జీపు చక్రాల గాలిని తీసివేశారు. నిందితుడి తండ్రిని తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు.

మూడు గంటల పాటు...

మూడు గంటల పాటు...

పోలీసులు ఎంత నచ్చజెప్పినప్పటికీ గ్రామస్థులు వినలేదు. జీపుకు అడ్డంగా కూర్చుని న్యాయం చేయాలని బైఠాయించారు. దాదాపు గంటల పాటు జీపుకు అడ్డంగా గ్రామస్తులు ఉండిపోయారు. జంగారెడ్డిగూ డెం డీఎస్పీ మురళీ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం నిందితుడి తండ్రి కాంతారావును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు గ్రామం లో మోహరించే ఉన్నారు.

వివాహేతర సంబంధమే...

వివాహేతర సంబంధమే...

ఇద్దరు పిల్లల మృతికి వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం రాత్రి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లల తల్లితో, వరుసకు బాబాయి రవిశేఖర్‌కు వివాహేతర సంబంధం ఉందని, చిన్నారుల తల్లి తనతో ఉండడానికి పిల్లలు అడ్డంకిగా ఉన్నారని రవిశేఖర్‌ చంపేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+