భార్య, కుమారుడిని అత్యంత కిరాతకంగా చంపి గోనె సంచుల్లో కుక్కాడు
అమరావతి: కట్టుకున్న భార్య, కన్న కొడుకుని అత్యంత దారుణంగా చంపిన నిందితుడిని కడప పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గత డిసెంబర్ 11న నాగేశ్వరి, ఆమె కుమారుడు ప్రణీత్ రాజు కడపలోని మరియాపురం నుంచి అదృశ్యమయ్యారు.
కారులో తిప్పుతూ, బిర్యానీ విషం ఇచ్చి భార్యాబిడ్డలను చంపేశాడు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నాగేశ్వరి భర్త ప్రవీణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు వెల్లడించిన నిజాలు పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేశాయి. భర్తే, బంధువుల సహకారంతో నాగేశ్వరి, కుమారుడు ప్రణీత్ రాజులను హత్య చేసి మృతదేహాలను గోనె సంచుల్లో కుక్కి పట్టణ శివారులోని పాలకొండ వద్ద పూడ్చిపెట్టినట్టు పేర్కొన్నాడు.
దీంతో శుక్రవారం పోలీసులు పాలకొండ ప్రాంతం నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

అగ్నిప్రమాదంలో చిన్నారి సజీవదహనం
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని విషాదం చోటు చేసుకుంది. హరిజన పేటలో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి సజీవ దహనమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగడంతో రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు పరుగు తీసినా దురదృష్టవశాత్తూ నాలుగు నెలల శివానీ అనే పసిపాపను మాత్రం బయటకు తీసుకురాలేక పోయారు. దట్టంగా మంటలు విస్తరించడంతో కాసేపటికే చిన్నారి సజీవ దహనమైంది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
అర్ధరాత్రి ఘర్షణ: ఒకరు మృతి
వైయస్సార్ కడప జిల్లా సీకేదిన్నె మండలం రోడ్డు క్రిష్టాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘర్షణలో బొలిశెట్టి శేఖర్(48) అనే వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఓ ద్విచక్రవాహన విషయంలో గ్రామానికి చెందిన నాగరాజు, చక్రధర్ అనే ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు.
ఈ ఘర్షణ చినికి చినికి పెద్ద గొడవగా మారి ఒకరి ప్రాణం తీసింది. క్షతగాత్రులకు కడప రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కడప రూరల్ సీఐ వెంకటశివారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications