భార్యాపిల్లలకు నిప్పటించి, తాను కాల్చుకున్నాడు

కర్నూలు: ఓ వ్యక్తి భార్యాపిల్లలపై కిరోసిన్‌పోసి వారికి నిప్పంటించి తానూ కాల్చుకున్నాడు. భార్యాభర్తలు, కుమారుడు మృతి చెందగా, కూతురు మృత్యువుతో పోరాడుతోంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడులో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగానే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. - గింది. చెరుకులపాడు గ్రామానికి చెందిన బోయ లింగన్న వివాహం తులసితో జరిగింది. వీరికి శివ, నీలవేణి పిల్లలు. భార్యతో లింగన్న తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి లింగన్న మద్యం తాగివచ్చి భార్యతో మరోసారి ఘర్షణ పడ్డారు.

Man kills wife and children, commits suicide

ఆవేశంతో ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బా తీసుకుని తొలుత తనపై పోసుకున్నాడు. అనంతరం భార్యతోపాటు ఇప్పరు పిల్లలపై పోసి నిప్పంటించాడు. అంతా గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు తలుపులు బద్దలు కొట్టి లోనికి చేరుకున్నారు. అప్పటికే మంటల్లో తులసి(28) మృతి చెందింది.

తీవ్రంగా గాయపడిన లింగన్న, ఇద్దరు పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కోలుకోలేక లింగన్న(36), కుమారుడు శివ(10) సోమవారం మృతి చెందారు. కూతురు నీలవేణి(3) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+