అదృష్టం కలిసొచ్చినా.. పెళ్లి కార్డ్ కొంపముంచింది.. అసలు ఏంటా స్టోరీ ?
అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటే ఇదేనేమో. అసలు ప్రస్తుతం పెళ్లి అంటేనే యువత మాకొద్దు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక వర్గం అంతా అసలు పెళ్లి వద్దు అంటుంటే.. మరో వర్గం మాత్రం పెళ్లి సంబంధం సెట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒక అమ్మాయిని సెలక్ట్ చేసుకొని.. ఇంట్లో పెద్దలను ఒప్పించి.. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పట్లో మాములు విషయం కాదు.
అయితే ఇటీవలే తెలంగాణలో ఇద్దరు అమ్మాయి లని ఒక అబ్బాయి ఒకేసారి పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దాంతో లడ్డూ కావాలా నాయనా.. రెండు లడ్డూలు కావాలా నాయనా అంటూ ఆ విషయాన్ని తెగ వైరల్ చేశారు. ఆ ఘటనలో ఇద్దరు అమ్మాయిలు వేరువేరు కుటుంబాలకు చెందిన వారు కాగా.. ఇప్పుడు ఆ తరహా ఘటనే ఏపీ లోనూ జరగాల్సి ఉండగా.. ఊహించని ట్విస్టులతో బ్రేక్ పడింది.

ఇక్కడ ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు సొంత అక్కాచెల్లెళ్లు కావడం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి.. ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనం అయిపోతున్న తరుణంలో ఇద్దర్ని చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లికి చెందిన గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కు చెందిన ఇద్దరు యువతులతో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 10వ తేదీన గోరంట్లలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. వారి వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డు సైతం సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ గా మారింది. ఇద్దరమ్మాయిలతో పెళ్లి, లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అంటూ కామెంట్స్ కూడా చేశారు.
పెళ్లి ఏర్పాట్లు చేయడం అన్నీ చక చక జరుగుతున్న తరుణంలో జరిగిపోతున్నాయి.. ఈ క్రమంలోనే వైరల్ గా మారిన పెళ్లి కార్డు పోలీసుల దృష్టికి రావడంతో వివరాలు సేకరించారు. దాంతో వధువులు ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని.. అంతే కాకుండా వారు మైనర్లు అని పోలీసులు గుర్తించారు. దాంతో యువకుడిని, అతడి కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
మైనర్లను వివాహం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దాంతో పెళ్లి కూడా క్యాన్సిల్ అవ్వడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications