చెల్లిని తల్లిని చేసిన అన్న.. బోనస్‌గా బిడ్డ.. కానీ అసలు ట్విస్ట్ అదే !
నేటి సమాజంలో మానవత్వం మంట గలిసి పోతుందా అనే ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న విషయం కూడా సభ్య సమాజాన్ని సైతం షాక్ కి గురి చేస్తోంది. మైనర్ బాలికపై వరుసకు అన్న అయ్యే వ్యక్తి ఏడాదిగా లైంగిక దాడి చేస్తూ తల్లిని చేశాడు. గర్భం దాల్చిన విషయాన్ని పురిటి నొప్పులు వచ్చే వరకు ఆ బాలిక ఎవరికీ చెప్పకుండా మిన్నకుండి పోయింది. తీరా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా విషయం బయటికి రాకుండా.. బిడ్డను వేరే వారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిపారు బంధువులు. మొత్తానికి అసలు నిజం బయటికి రావడంతో సదరు నిందితుడు చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లాలోని కీళా పల్లె మండలం గ్రామంలో ఒక మైనర్ బాలిక నివాసం ఉంటుంది. బాలిక తండ్రి అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమవ్వగా.. ఆర్థిక పరిస్థితులు బాగోలేక పోవడంతో తల్లి బతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలికపై.. ఆమె పెద్ద నాన్న కుమారుడు (అన్న) మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. గర్భం దాల్చిన విషయాన్ని సైలెంట్ గా ఉంచిన బాలిక.. పురిటి నొప్పులు రావడంతో బంధువులను ఆశ్రయించింది.

బాలిక బంధువులు ఆమెను ఈనెల 7 వ తేదీన పీలేరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కాన్పు చేసి.. పసిబిడ్డను వేరే వారికి ఇవ్వడానికి బంధువుల సాయంతో ఆసుపత్రి నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విషయం బయటపడడంతో బంధువులు.. బాలికను స్వగ్రామానికి తీసుకొని వెళ్ళిపోయినట్టు చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకొని గ్రామం నుంచి నిందితుడు పారిపోయాడు. ఆ పసిబిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని.. బాలిక బాగోగులు తాము చూసుకుంటామని నిందితుడి కుటుంబసభ్యులు మంతనాలకు దిగినట్టు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఘటన పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications