పుష్ప2 చూసొచ్చి ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు-ఏపీలో షాకింగ్ ఘటన..!

సినిమాల ప్రభావం సమాజంపై అంతకంతకూ ఎక్కువవుతోంది. సినిమాలు చూసి అలాగే దొంగతనాలు, హత్యలు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. సినిమాల్లో ఉన్నా, లేకపోయినా కొన్ని సీన్ల ప్రభావంతో స్పూర్తి పొంది నేరాలకు పాల్పడే వారిని చూస్తున్నా్ం. అలాంటిదే ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం చూసి వచ్చిన ఓ యువకుడు ఏకంగా డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తాజాగా ఓ ఆర్టీసీ అద్దె బస్సు చోరీకి గురైంది. నర్సీపట్నం డిపోకి చెందిన ఈ ఆర్టీసీ అద్దె బస్సు రెండు రోజుల క్రితం ఆదివారం రాత్రి మాయం అయింది. దీంతో ఆర్టీసీ అధికారులతో పాటు సిబ్బంది షాకయ్యారు. నర్సీపట్నం డిపో నుంచి నిరంతరం తుని తిరిగే ఈ బస్సును రాత్రి విధులు పూర్తయ్యాక సిబ్బంది డిపోలో పార్క్ చేశారు. తిరిగి సోమవారం యథావిధిగా తెల్లవారుజామున 4:30 గంటలకు డ్రైవర్ బస్సును తీసేందుకు చూస్తే అక్కడ బస్సు లేదు.

man ran away with rtc bus after watching allu arjun s pushpa 2 movie in ap

కంగారు పడ్డ బస్సు డ్రైవర్ వెంటనే డిపో మేనేజర్, బస్సు యజమానికి సమాచారం అందించారు. అనంతరం వారి సమాచారంతో నర్సీపట్నం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలించారు. చివరికి నర్సీపట్నం నుంచి అల్లూరి జిల్లా చింతపల్లి వెళ్లే రూట్లో బస్సును కనుగొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం పట్టణ సీఐ గోవిందరావు వెల్లడించారు. విచారణలో తమిళనాడు కి చెందిన సాదిక్.. పుష్ప 2 చూసి బస్టాండ్ లో పడుకున్నాడని, వాహనానికి తాళం ఉండటంతో బస్సుతో పరారయ్యాడని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+