బాలికపై లైంగిగ దాడి యత్నం: చితకబాదిన ప్రజలు

విజయవాడ: ఐదేళ్ల బాలికపై ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ కలికివాయ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక తల్లిదండ్రులు పచ్చాకు కూలీ పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. కూతురిని పెద్దమ్మ వెంకాయమ్మ వద్ద ఉంచారు.

ఆదివారం ఇంటి వద్ద ఉన్న చర్చికి వెళ్లగా, అదే గ్రామానికి చెందిన దాసరి కోటేశ్వర రావు (50) బాలికను చర్చి సమీపంలో మరుగుగా ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు కోటేశ్వరరావును చితకబాది పోలీసులకు అప్పగించారు.

Man tries to sexually assault against 5 year old girl

వ్యక్తి దారుణ హత్య

అదలావుంటే, కర్నూలు జిల్లాలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి చేసి, అతన్ని గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలం మొదుగుల దిబ్బలో జరిగింది.

గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి పిండిమర నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని అక్కడే పడుకున్నాడు. సోమవారం తెల్లారేసరికి శవమై కనిపించాడు. హత్యకు కారణాలు తెలియరాలేదు. తమకు ఎవరితోనూ గొడవలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యపై భర్త దాడి

నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న రావూరు మీనాపై ఆమె భర్త సుబ్రహ్మణ్యం ఆదివారు దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె గాయపడింది. సుబ్రహ్మణ్యం తరుచుగా మద్య సేవించి భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడని, ఆదివారం మద్యం సేవించి వచ్చి ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలంటూ వివాదానికి దిగాడని పోలీసులు చెప్పారు.

వివాదంతో ఆగకుండా భార్యపై దాడి చేశాడని, స్థానికులు అతన్ని అడ్డుకుని తమకు అప్పగించారని పోలీసులు చెప్పారు. గాయపడిన మీనాను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+