టీడీపీలోకి మంచు మ‌నోజ్‌..! నియోజ‌క‌వ‌ర్గం ఖ‌రారు..! లీక్‌చేసిన మాజీ ఎమ్మెల్యే!

మంచు మోహ‌న్‌బాబు కుటుంబం నుంచి ఒక‌రు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వాటికి బ‌లం చేకూరుస్తూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్ర‌కాశ‌రావు చేసిన వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

రాజకీయాలు ఇష్టమేనన్న మనోజ్!

రాజకీయాలు ఇష్టమేనన్న మనోజ్!


మోహ‌న్‌బాబు రెండో కుమారుడు మ‌నోజ్ ఇటీవ‌ల భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక‌తో క‌లిసి హైద‌రాబాద్ లోని ఒక వినాయ‌క మండ‌పం వ‌ద్ద క‌నిపించారు. దీంతో వీరిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అవి నిజమేనని గోనె అన్నారు. మంచు మ‌నోజ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయాలంటే త‌న‌కూ ఇష్ట‌మేన‌ని, పోటీచేస్తానంటూ మ‌నోజ్ గ‌తంలోనే ప్ర‌క‌టించారు.

చంద్రగిరి నుంచి బరిలోకి..!

చంద్రగిరి నుంచి బరిలోకి..!

తాజాగా ప్ర‌కాశ‌రావు చెప్పిన‌దాని ప్ర‌కారం సైకిల్ ఎక్క‌డం ఖ‌రారైంద‌న్నారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాబోయే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని తెలిపారు. అంతే కాకుండా మౌనిక‌, మ‌నోజ్ వివాహం చేసుకోబోతున్నారని తెలిపారు. మ‌నోజ్ త‌న భార్య ప్ర‌ణ‌తిరెడ్డి నుంచి విడాకులు తీసుకున్నారు. 2015లో వివాహం చేసుకొని 2019లో విడిపోయారు. అలాగే మౌనిక కూడా తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఇద్దరికీ ద్వితీయ వివాహం అవుతుందన్నారు. ఇద్దరూ ప్రముఖ కుటుంబాలకు చెందినవారు కావడంతో మంచి ముహూర్తం చూసి పెళ్లి కబురు చెప్పాలనుకున్నంటున్నారని వెల్లడించారు.

చంద్రబాబుపై పార్టీ శ్రేణుల ఒత్తిడి!

చంద్రబాబుపై పార్టీ శ్రేణుల ఒత్తిడి!

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మోహ‌న్‌బాబును జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ఎంపిక చేస్తార‌ని ఆశించారు. అదేమీ జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌లే గంట‌కు పైగా చంద్ర‌బాబునాయుడితో స‌మావేశం నిర్వ‌హించారు. అయితే మోహన్ బాబు కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నాయి. గత ఎన్నికల్లో మోహన్ బాబు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించారని, వైసీపీలో సీటివ్వకపోవడంతోనే మళ్లీ ఇక్కడకు వస్తున్నారంటున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం విద్యార్థులతో కలిసి ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+