Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిడిపిలోకి మండలి: కర్నూలు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు

Mandali Buddha Prasad may join in TDP
హైదరాబాద్: కృష్ణా జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరే దిశగా ఆయన కార్యాచరణ చేపట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన టిడిపి నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ శాసనసభా స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీటుకు అంబటి రమేష్ తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మండలి బుద్ధప్రసాద్‌ను తీసుకోవాలనే ఆలోచనను అవనిగడ్డ నాయకులు కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఆ నియోజకవర్గంలోని మండల కమిటీ అధ్యక్షులు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి దీనిపై మాట్లాడారు.


కర్నూలు నుంచి మరో ఇద్దరు..

కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి ముందుగానే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో బెర్త్ రిజర్వ్ చేసుకున్నారు. పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి టిడిపి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు జిల్లాకు చెందిన తెలుగుదేశం సీనియర్ నేత కెఇ కృష్ణమూర్తితోను, పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా రాంభూపాల్‌రెడ్డి తన సీటు విషయం చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు ఇంకా ఏరాసు, కాటసాని విషయాలను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. తన స్వగ్రామం పాణ్యం నియోజకవర్గం గడివేముల కావడంతో తనకు ఆ సీటు కావాలంటూ ఏరాసు పట్టుపడుతున్నారు. కానీ సిటింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తాను పాణ్యం తప్ప మరోచోట నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే, రాబోయే ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిని బరిలోకి దించితే సునాయసంగా విజయం సాధించవచ్చనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు సమాచారం.

12న గంటా చేరిక?

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఎనిమిదిన విశాఖలో నిర్వహించ తలపెట్టిన మహిళా సదస్సును తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేయనుంది. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మిగిలిన నలుగురు శాసనసభ్యులు 12న తెలుగుదేశంలో చేరనున్నట్టు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+