Lady Aghori: లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి-గుజరాత్ పోలీసుల ఎంట్రీతో..!
ఏపీలోని మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే యువతిని రెండు నెలల క్రితం లేడీ అఘోరీ నాగసాధు ప్రలోభాలకు గురిచేసి ఎత్తుకుపోయినట్లు గతంలో ఆమె తల్లితండ్రులు ఆరోపించారు. గతంలో మంగళగిరికి వచ్చిన అఘోరీని తమ ఇంటికి పిలిచి బట్టలు ఇచ్చామని, ఆ సమయంలో తమ కూతురుని ప్రలోభాలకు గురి చేసి తమకు దూరం చేసిందని వారు ఆరోపించారు. దీనిపై మంగళగిరి పీఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే శ్రీవర్షిణి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ శ్రీవర్షిణి తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయినా పోలీసులు తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి శ్రీవర్షిణిని లేడీ అఘోరీ చెర నుంచి విడిపించారు. గుజరాత్ లో శ్రీవర్షిణి ఆచూకి గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళగిరిలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బయలుదేరి వెళ్లారు.

లేడీ అఘోరీ నుంచి శ్రీ వర్షిణిని తీసుకుని కుటుంబ సభ్యులు బయలుదేరారు. అయితే లేడీ అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదంటూ యువతి మొర పెట్టుకుంటున్న దృశ్యాలు బయటికి వచ్చాయి. శ్రీవర్షిణిని మాయ చేసి అఘోరీ తీసుకెళ్లిందని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. తమ కూతురిని విడిపించాలని తండ్రి కేసు పెట్టడంతో వర్షిణిని కుటుంబ సభ్యులకు గుజరాత్ పోలీసులు అప్పగించారు. ప్రస్తుతం వర్షిణిని ఏపీకి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు రోజుల్లో వర్షిణి మంగళగిరికి చేరుకునే అవకాశం ఉంది. అయితే వర్షిణిని పట్టుకోవడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగళగిరి పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications