మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి : జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు, లోకేష్ లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ ను టార్గెట్ చేశారు. అభినవ వాగ్గేయకారుడు సంగీత సామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేడుకగా జరపాలని గత టీడీపీ హయాంలో నిర్ణయించామని, దానిని అమలు చేశామని, కానీ జగన్ సర్కార్ ప్రస్తుతం ఆ ఆనవాయితీని కొనసాగించటం లేదంటూ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

బాలమురళీకృష్ణ జయంతిని ప్రభుత్వ హయాంలో జరపటం లేదని ఆవేదన

బాలమురళీకృష్ణ జయంతిని ప్రభుత్వ హయాంలో జరపటం లేదని ఆవేదన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ప్రభుత్వ హయాంలో జరపామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పని చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. సంగీత కళానిధి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తెలుగువారందరికీ గర్వకారణం అయిన కళాకారుడని, ఆ గాయక శిఖామణి గౌరవార్థం బాలమురళీకృష్ణ గారి జయంతిని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రకటించి అమలు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో మంగళంపల్లి జయంతి వేడుకలు ఘనంగా

టీడీపీ హయాంలో మంగళంపల్లి జయంతి వేడుకలు ఘనంగా


గుంటూరులోని ప్రభుత్వ సంగీత,నాట్య కళాశాలకు బాలమురళీకృష్ణ గారి పేరును పెట్టామని అలాగే ప్రతి ఏటా సంగీత నిష్ణాతులకు బాలమురళీకృష్ణ పేరుతో అవార్డు ఇవ్వాలని, సంగీతం నేర్చుకునే ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. బాలమురళీకృష్ణ గారిచే రచించబడిన 300 సంకీర్తనలను రికార్డ్ చేయించాలని ప్రణాళికలు వేశామని ఈ ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలేవీ జరగకపోవడం బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ సర్కార్ కనీసం పట్టించుకోకపోవడం మనోవేదనకు గురి చేస్తుందన్న లోకేష్

జగన్ సర్కార్ కనీసం పట్టించుకోకపోవడం మనోవేదనకు గురి చేస్తుందన్న లోకేష్


ఈరోజు బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి కళా సేవ స్మరించుకుంటూ ఆ కళా భూషణుడి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వేడుకగా జరగాల్సిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవాన్ని ప్రస్తుత జగన్ సర్కార్ కనీసం పట్టించుకోకపోవడం మనోవేదనకు గురి చేస్తుందని నారా లోకేష్ పేర్కొన్నారు.ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నా అని పేర్కొన్నారు లోకేష్ .

మన మహనీయులను మనమే గౌరవించుకోవాలి జగన్ రెడ్డి

మన మహనీయులను మనమే గౌరవించుకోవాలి జగన్ రెడ్డి

గత టీడీపీ ప్రభుత్వంలో మంగళం పల్లి వారి జయంతిని ప్రభుత్వ కార్యక్రమం గా నిర్ణయించి, గుంటూరు సంగీత కళాశాలకు వారి పేరు పెట్టి, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వారి పేరుమీద నిర్వహించామని తెలిపారు. కానీ నేటి సర్కార్ దాన్ని పట్టించుకోకపోవడం అంటే మళ్లీ మనమే అవమానించుకున్నట్లు అంటూ ప్రముఖ వాగ్గేయకారుడిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా జగన్ రెడ్డి గారు మన మహనీయులను మనమే గౌరవించుకోవాలి అనేది కాస్త తెలుసుకోండి అంటూ పేర్కొన్న నారా లోకేష్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోండి అంటూ జగన్ కు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+