ఎన్నికల వేళ.. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీగా ఠాగూర్: భారీ ప్రక్షాళణ
Congress: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి.
ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం మినహాయిస్తే- మూడు చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా మారిందనేది బహిరంగ రహస్యం.

ఇదే దూకుడును అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సంస్థాగతంగా ప్రక్షాళణకు పూనుకుంది. దీని కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులకు కొత్త బాధ్యతలను అప్పగించింది. ప్రియాంక గాంధీ వాద్రాకు ఇదివరకు ఉన్న ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జీ బాధ్యతల నుంచి తప్పించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జీలను అపాయింట్ చేసింది. ముకుల్ వాస్నిక్- గుజరాత్, జితేంద్రసింగ్- అస్సాం, మధ్యప్రదేశ్ (అదనపు ఇన్‌ఛార్జ్) బాధ్యతలను అప్పగించింది.
రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా- కర్ణాటక, దీపక్ బబారియా- ఢిల్లీ, హర్యానా (అదనపు ఇన్‌ఛార్జ్), సచిన్ పైలెట్- ఛత్తీస్‌గఢ్, అవినాష్ పాండే- ఉత్తరప్రదేశ్, జీఏ మిర్- జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ (అదనపు ఇన్‌ఛార్జ్), దీపా దాస్‌మున్షీ- కేరళ, లక్షద్వీప్, తెలంగాణ (అదనపు ఇన్‌ఛార్జ్), జైరామ్ రమేష్- కమ్యూనికేషన్స్, కేసీ వేణుగోపాల్- ఆర్గనైజేషన్ నియమించింది.
వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌ఛార్జీలు అపాయింట్ అయ్యారు. రమేష్ చెన్నితల- మహారాష్ట్ర, మోహన్ ప్రకాష్- బిహార్, డాక్టర్ చెల్లకుమార్- మేఘాలయా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, డాక్టర్ అజొయ్ కుమార్- ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి (అదనపు ఇన్‌ఛార్జ్)గా నియమితులయ్యారు.
భరత్‌సింహ్ సోలంకి- జమ్మూ కాశ్మీర్, రాజీవ్ శుక్లా- హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, దేవేందర్ యాదవ్- పంజాబ్ బాధ్యతలను అప్పగించింది ఏఐసీసీ. మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీగా వ్యవహరించిన మాణిక్ రావ్ థాకరేను అదే స్థానంలో కొనసాగిస్తూనే గోవా, దామన్, డయ్యు, దాద్రానగర్ హవేలీ బాధ్యతలను కేటాయించింది. దీపా దాస్‌మున్షీ తెలంగాణకు అదనపు ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తారు.
కీలకమైన ఏపీ ఇన్‌ఛార్జీ బాధ్యతలను మాణిక్కం ఠాగూర్ చేతిలో పెట్టింది. గతంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీగా పని చేస్తారాయన. గిరీష్ చోడంకర్‌కు త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్ బాధ్యతలను అప్పగించింది.












Click it and Unblock the Notifications