Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ. 200 కోట్లు కూడబెట్టారు: శైలజానాథ్‌పై సన్నిహితుడి ఆరోపణ

అనంతపురం: మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్‌పై ఆయన సన్నిహితుడు మంజునాథ్‌నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. 342 సర్వే నెంబర్‌లో తన పేరుపై ఉన్న రూ.కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాల్లో కలిపి రూ.200 కోట్లకు పైగా కూడబెట్టారని ఆయన ఆరోపించారు. రాజీవ్‌ విద్యామిషన్‌, సర్వశిక్షన్‌ అభియాన్‌లో రూ.వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. తన దగ్గర ఆధారాలున్నాయి, విచారణ జరిపితే తెలియజేస్తానని ఆయన చెప్పారు. తనకు శైలజానాథ్‌ నుంచి ప్రాణహాని ఉందని మంజునాథ్‌నాయుడు తెలిపారు.

Manjunath naidu makes allegations against Shailajanath

శైలజానాథ్ అక్రమాస్టులు కూడబెట్టారని ఆరోపిస్తూ మంజునాథ నాయుడు మంగళవారంనాడు ఎసిబి, సిబిఐలకు ఫిర్యాదు చేశారు. శైలజానాథ్ మంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ప్రభుత్వ ఆదయానికి అధికారులతో భారీగా గండికొట్టారని అన్నారు.

తన భూమి వ్యవహారం హైకోర్టులో విచారణలో ఉండగా శైలజానాథ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+