సంచైతా.. వైసీపీ తోలుబొమ్మలా ఉండకు - బ్రాహ్మణి, భువనేశ్వరిని చూడాలంటూ అనిత ఫైర్.. ఆపై సాయిరెడ్డి పంచ్
కేరళలోని ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామి ఆలయం వ్యవహారాలు చూసే హక్కు ట్రావెన్‌కోర్ రాజవంశీకులకే ఉంటుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కేంద్రంగా పనిచేసే ''మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మన్సాన్) ట్రస్ట్'' వ్యవహారం మరోసారి చర్చలోకి వచ్చింది. గజపతిరాజు కుటుంబ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, మన్సాన్ ట్రస్టు, సింహాచలం ఆలయ వ్యవహారాల్లో జగన్ సర్కారు తలదూర్చి రాజకీయాలు చేయడం తగదన్న చంద్రబాబు వ్యాఖ్యలతో తాజా వివాదం మొదలైంది.

బాబుకు దీటుగా సమాధానం..
మన్సాన్ ట్రస్టు, సింహాచలం ఆలయా నిర్వహణ బాధ్యత గజపతిరాజు కుటుంబీకులకే దక్కాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు లింగ వివక్షకు అద్దం పట్టేలా ఉన్నాయని, దేవస్థానానికి, ట్రస్టుకు చైర్ పర్సన్ గా ఉన్న తనను గుర్తించకపోవడం బాధాకరమని సంచైత గజపతిరాజు పేర్కొన్నారు. బాబు వ్యాఖ్యలకు సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పిన ఆమె.. ఎడాపెడా వాయించినంతపని చేశారు. హక్కుదారును కాబట్టే తాను పదవులు చేపట్టానని స్పష్టం చేశారు.

బాబుగారూ దూరంగా ఉండండి..
‘‘మా తాతగారు పీవీజీ రాజుగారికి పెద్దకుమారుడిగా ఆనందగజపతిరాజుగారికి, వారి పెద్ద సంతానంగా నాకు వారసత్వపు హక్కులు లభించాయి. అశోక్‌గజపతిరాజుగారిలా కాకుండా చంద్రబాబునాయుడుగారు పురుషులతోపాటు మహిళలకూ సమానంగా హక్కులు ఉంటాయని గుర్తించారనే అనుకుంటున్నా. నేను లేను అన్నట్టుగా, మొత్తం గజపతుల కుటుంబానికి తానే వారసుడ్ని అన్నట్టుగా అశోక్‌గారు తప్పుదోవపట్టిస్తున్నారు. గజపతుల కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేయకుండా వీటికి చంద్రబాబుగారు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను''అని సంచైత తన ప్రకటనలో పేర్కొన్నారు.

సంచైతకు అదిరిపోయే కౌంటర్..
పురుషులతోపాటు మహిళలకూ సమానంగా హక్కులు ఉంటాయని చంద్రబాబు గుర్తించాలంటూ తీవ్ర స్వరంతో మాట్లాడిన సంచైతపై తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత ఫైరయ్యారు. లింగ సమానత్వం గురించి సంచైత దగ్గర నేర్చుకోవాల్సినంత దిగువ స్థాయిలో చంద్రబాబు లేరని, సంచైత ముందూ వెనక చూసుకుని మాట్లాడాలని అనిత హితవు పలికారు. చంద్రబాబును ఉద్దేశించి సంచైత పలికిన ప్రతిమాట తప్పేనని, మహిళల్ని ప్రోత్సహించడంలో ఎవరైనా చంద్రబాబు తర్వాతేనని అనిత గుర్తుచేశారు.

వాళ్లద్దర్నీ చూడు.. నువ్వు బొమ్మలా..
‘‘హాయ్.. సంచైత.. జెండర్ ఈక్వాలిటీ గురించి చంద్రబాబుకు చెబుతున్నావా? ఆయన భార్య(భువనేశ్వరి), కోడలు(బ్రాహ్మణి) వారి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న తీరు మీరు చూడట్లేదా? చంద్రబాబు లింగబేధాలను పట్టించుకోరనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? ఇలాంటి నిబంధనల గురించి మీ తాతగారినే అడగాలి. అంతేకానీ, వైసీపీ చేతిలో తోలుబొమ్మలా ఉండకండి..'' అని అనిత ఫైరయ్యారు. బీజేపీలో యాక్టివ్ మెంబరైన సంచైతను మన్సాన్, సింహాచలం దేవస్థానానికి చైర్ పర్సన్ గా నియమిస్తూ వైసీపీ సర్కారు ఉత్తర్వులివ్వడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత పార్టీ మార్పుపైనా చర్చ జరిగినా రెండువైపులా ఎవరూ స్పందించలేదు.
Recommended Video

వేలు పెట్టి తిట్టించుకుంటావ్..
సంచైత, చంద్రబాబు మధ్య జరిగిన సంవాదంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం తనదైన శైలిలో స్పందించారు. ‘‘విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాల్లోగానీ, మన్సాన్ ట్రస్టులోగానీ జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలేదని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి స్పష్టం చేశారు. మహిళ అయిన సంచైత సారధ్యం వహిస్తుంటే ఆమెను కించపర్చేలా చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. ‘‘ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది చంద్రబాబే. సంబంధంలేని విషయాల్లో కాలు , వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్? సంచయిత గజపతుల కుటుంబ సభ్యురాలు కాదా ? లేక మహిళలంటే నీకు చిన్న చూపా?''అని సాయిరెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications