మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టు నేత శివనారాయణ అరెస్టు, జైలుకు

By Pratap
|
Google Oneindia TeluguNews

మెదక్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పూస శివన్నారాయణను జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కాలికి గాయంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో శివన్నారాయణ చికిత్స పొందుతున్నారన్న సమాచారం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు గత రాత్రి శివన్నారాయణను అరెస్ట్ చేశారు.

హత్య, విధ్వంసం కేసులో శివన్నారాయణ నిందితుడిగా ఉన్నారు. 1992 నుంచి శివన్నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. శివన్నారాయణ తలపై ప్రభుత్వం 5 లక్షల రివార్డు ప్రకటించింది. యాభై ఏళ్ల పడిలో ఉన్న శివన్నారాయణ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రొటెక్షన్ ప్లాటూన్ ఇంచార్జీగా పనిచేస్తున్నాడు.

మెదక్ జిల్లాలోని గజ్వెల్ పోలీసు స్టేషన్ పరిధిలో 2001లో జరిగిన ఓ హత్య కేసులో అనతు నిందితుడు. అతను గత 23 ఏళ్లుగా అజ్ఝాతంలో ఉంటున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ చెప్పారు.

మెదక్ జిల్లాలోని గజ్వెల్ మండలం బెజగామ శివనారాయణ స్వగ్రామం. అరెస్టు చేసిన తర్వాత శివనారాయణను పోలీసులు మెదక్ జిల్లా కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

 Maoist carrying cash reward of Rs 3 Lakh arrested

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్లాటూన్ కమాండర్ పూస శివనారాయణ అలియాస్ వెంకన్న అలియాస్ జీవన్ 1992లో అప్పటి పీపుల్స్‌వార్ దళంలోకి వెళ్లినట్లు గజ్వెల్ సిఐ అమృత రెడ్డి చెప్పారు. శివనారాయణ జోగన్నగారి వెంకటరెడ్డి హత్యతో పాటు కొల్గూరి శ్రీనివాస్ గౌడ్, శేరిపల్లి చంద్రంగౌడ్, మద్ది రాజిరెడ్డిలపై దాడి తదితర కేసుల్లో నిందితుడని ఆయన చెప్పారు.

శివనారాయణను చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. శివనారాయణ వద్ద ఓ కత్తి మాత్రమే లభించిందని, ఆయుధాన్ని పార్టీలోనే వదిలి వచ్చినట్లు చెబుతున్నాడని ఆయన చెప్పారు.

English summary
A Maoist District Committee Member, carrying a cash reward of Rs 3 lakh on his head, was today arrested in neighbouring Medak district of Andhra Pradesh, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X