అనారోగ్యమే: మావోయిస్టు దంపతులు (పిక్చర్స్)
హైదరాబాద్: అనారోగ్యంతోనే ప్రభుత్వానికి లొంగిపోయామని మాజీ మావోయిస్టు రవీందర్ దంపతులు పేర్కొన్నారు. గతనెల రాష్ట్ర డిజిపి ఎదుట చంబాల రవీందర్ దంపతులు లొంగిపోయారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
రివార్డు కోసం లొంగిపోయారన్న వాదనలో నిజం లేదని తెలిపారు. తన భార్య రణితకు టిబి, అల్సర్ వ్యాధులు ఉన్నాయని రవీందర్ చెప్పారు. ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నవారికి, కొత్తగా చేరబోయేవారిని ఎలాంటి సలహా ఇవ్వదలుచు కోలేదని, తమకు చేతనైనంత కాలం పార్టీలో పనిచేశామని, ఇప్పుడు తమ వల్ల కావడం లేదని అన్నారు.
పార్టీకి లేఖ రాసి, ఆయుధాలు వదిలేసి వచ్చామని, పూర్తిగా జనజీవన స్రవంతిలో జీవిస్తామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదం, ఐఎస్‌ఐతో మవోయిస్టు పార్టీకి సంబంధాలు పూర్తి అబద్ధమని, నేపాల్ మావోయిస్టులతో సంబంధాలు మాత్రం కొట్టిపారేయలేమని చెప్పారు.

తెలుగువాళ్లదే నాయకత్వం
జాతీయ స్థాయిలో తెలుగువాళ్లే నాయకత్వం వహిస్తున్నారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత భవిష్యత్‌ను రూపొందించుకుంటామని అన్నారు.

రహస్యాలు చెప్పలేదు
మవోయిస్టు పార్టీకి సంబంధించిన రహస్యాలను వెల్లడించలేదని, తమకు ఎవరి వలన ప్రాణభయం లేదని రవీందర్ తెలిపారు.

అనారోగ్యంతోనే..
కొంతకాలంగా నడుము, కాళ్లు, కంటి వ్యాధులతో బాధపడుతున్నామని చంబల రవీందర్ అన్నారు. దాంతోనే లొంగిపోయామని అన్నారు.

మావోయిస్టు అగ్రనేత...
మావోయిస్టులకు తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి సారథ్యం వహిస్తున్నారు.
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications