సీఐడీ లుక్ ఔట్ నోటీసులపై హైకోర్టుకు మార్గదర్శి ఎండీ..!!
మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే మార్గదర్శికి చెందిన రూ 794 కోట్లను అటాచ్ చేసిన సీఐడీ మరో నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పైన శైలజా కిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నోటీసులను ఉపసంహరించుకొనేలా సీఐడీకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. శైలజా తరపున న్యాయవాది రత్నకుమార్ హైకోర్టులో ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసారు.
పిటీషనర్ పై అమరావతి పోలీసు స్టేషన్ లో నమోదైన కేసుల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా సీఐడీ ఖాతరు చేయటం లేదని కోర్టుకు నివేదించారు. జూన్ 6న ఇంటి వద్ద 10 గంటలకు అందుబాటులో ఉండాలంటూ పిటీషనర్ కు సీఐడీ నోటీసులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పిటీషనర్ ఈ విచారణకు హాజరయ్యేందుు జూన్ 3న అక్కడి నుంచి రావటానికి టికెట్లు బుక్ చేసుకున్నారని వివరించారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ సీఐడీ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలకు విరుద్దంగా నోటీసులు జారీ చేసిందని తెలిపారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో విమానాశ్రయంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. జూన్ 3న హైదరాబాద్ విమానాశ్రయంలో ఎలాంటి అడ్డుకుంలు సృష్టించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా ఇమ్మిగ్రేషన్ బ్యూరో తో పాటుగా ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి..ఏపీ సీఐడీ అధికారులను చేర్చారు. ఇక..మార్గదర్శి ఆస్తుల అటాచ్ మెంట్ వ్యవహారం పైన ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విమర్శలు కొనసాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications