జగన్‌కు షాక్.. టిడిపిలోకి భూమా, అఖిల, మరో ఇద్దరు?: మంత్రి పదవి?

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిల ప్రియ (ఎమ్మెల్యే) పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకివ్వనున్నారా? అంటే అవుననే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంప్రదింపులు జరుగుతున్నాయంటున్నారు.

భూమా నాగిరెడ్డి ప్రస్తుతం పిఎసి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే. వీరిద్దరు త్వరలో టిడిపిలో చేరుతారని కర్నూలు జిల్లాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం మూడు నాలుగు గంటల సమయంలో భూమా తన కార్యకర్తలతో భేటీ కానున్నారని తెలుస్తోంది.

May Bhuma Nagi Reddy, Akhila Priya join TDP?

మంత్రి పదవి ఆఫర్?

భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో చేరితే ఓ మంత్రి పదవిని చంద్రబాబు ఇస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డలు పూర్తిగా వెనుకబడ్డాయని, వాటి అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరందుకు మొగ్గు చూపుతున్నారట.

వైసిపిలో ఎలాంటి ఇబ్బందిలేకున్నప్పటికీ...

భూమా నాగిరెడ్డికి, ఆయన కూతురు అఖిల ప్రియకు వైసిపిలో ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. అయినప్పటికీ తమ నియోజకవర్గాలు, జిల్లాల అభివృద్ధి కోసం భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

భూమాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు?

భూమాకు కర్నూలు జిల్లాలో మంచి బలగం ఉంది. ఈ నేపథ్యంలో భూమాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం కార్యకర్తలతో భేటీ అనంతరం చేరుతారా లేదా తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+