మేయర్ అనురాధ దంపతుల హత్యకు ఆరు నెలల స్కెచ్: చిక్కిన వీడియో
చిత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యలకు సంబంధించి పోలీసులు కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ సన్నిహితుడి ఇంట్లో నుంచి వారు ఓ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ ల్యాప్‌టాప్‌లోని విషయాలను విశ్లేషించగా - మున్సిపల్ ఆఫీసులోకి ఎలా వెళ్లాలి, ఎలా హత్య చేయాలి అే విషయాలపై చింటూ ముందుగా వేసుకున్న మొత్తం స్కెచ్ ఓ వీడియో రూపంలో ఉన్నట్లు తెలిసింది. దాదాపు ఆరు నెలల నుంచి మేయర్ దంపతుల హత్యకు కుట్ర పన్నుతున్నట్లు ఆ వీడియో ద్వారా తెలిసింది.

ఇంత జరుగుతున్నా పోలీసులకు గానీ, నిఘా వర్గాలకు గానీ ఎక్కడా సమాచారం అందలేదు. గురువారం వరకు పోలీసులు ఈ కేసులో మొత్తం 11 మందికి నోటీసులు జారీ చేశారు. తాజాగా 14 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేసి చింటూ ఇంట్లో ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
మరో 14 మంది ఇళ్లలో సోదాలు చేసి, చింటూకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో 47వ వార్డు కౌన్సిలర్ పద్మావతి భర్త మురుగ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కీలక నిందితుల పాత్ర ఈ కేసులో ఇంకా వెల్లడి కావాల్సే ఉంది. ఇప్పటి వరకు 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications