రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణకు కాస్త అన్నం పెట్టండి - నాగబాబు పిలుపు : ఫ్యాన్స్.. నన్ను వదిలేయండి..!!

|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి.. జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీని పైన మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చిరంజీవి ఊసరవెల్లి అంటూ సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యల పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ వ్యవహారంలో స్పందించారు. నారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కొంత మంది మెగా అభిమాన సంఘాల నేతలు నారాయణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. దీని పైన ఇప్పుడు నాగబాబు ట్వీట్.. నారాయణ స్పందన హాట్ టాపిక్ గా మారాయి.

అన్నం పెట్టండి అంటూ నాగబాబు ట్వీట్

అన్నం పెట్టండి అంటూ నాగబాబు ట్వీట్


సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యల పైన తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన నాగబాబు.. ఇటీవలి కాలంగా మెగా అభిమానులు, జనసైనికులు కొంత మంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ, మన కుర్రాళ్లకు నేను చెప్పదలచుకుందేంటంటే సీపీఐ నారాయణ కొంత కాలంగా అన్నం మానేసి..కేవలం ఎండు గడ్డి.. చెత్తా చెదారం తింటున్నారని ట్వీట్ చేసారు. మెగా అభిమానులంతా దయచేసి వెళ్లి..అతనితో గడ్డి తినటం మాన్పించి..కాస్త అన్నం పెట్టండి..అంటూ సూచించారు.

వెనక్కు తీసుకున్న నారాయణ

వెనక్కు తీసుకున్న నారాయణ

దీని ద్వారా తాను తిరిగి తెలివి తెచ్చుకొని మనిషిలా మారుతారని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో తాను గతంలో మెగా బ్రదర్స్ పైన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తాను చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన పదాల్లో భాషా దోషంగా భావించాలని సూచించారు. తాను చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మెగా అభిమానులు...కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలను మరిచిపోవాలంటూ కోరారు.

మెగా ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారేనా

మెగా ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారేనా


తనకు ఫోన్లు వస్తున్నాయని..ఇక, ఈ వివాదం వదిలేయాలని సూచించారు. చిరంజీవి సైతం రాజకీయ నేతగా పని చేసారని.. విమర్శలను స్పోర్టివ్ గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని దుయ్యబట్టారు. వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే పోలవరం వరద వివాదానికి కారణంగా నారాయణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు నారాయణ స్వయంగా తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నట్లుగా చెప్పటంతో ఈ వివాదం ముగిసిపోయే అవకాశం కనిపిస్తోంది.

English summary
Nagababu Reacted on CPI NArayana Comments Against Chiranjeevi and PAwan Kalyan, Narayana withdrawn his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X