మెగా డీఎస్సీపై ఆరోపణలు కాదు రుజువులేవీ.. చర్చకు రమ్మంటే పారిపోతావా జగన్!

మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ ప్రధానికి లేఖ రాసి, విద్యాశాఖా మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ మంత్రులు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆరోపణలు కాదు రుజువులు చూపించమంటే జగన్ ముఖం చాటేస్తున్నాడని, దమ్ముంటే చర్చకు రా అని సవాల్ చేస్తున్నా పారిపోతున్నాడని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు.

మెగా డీఎస్సీ పైన మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదు : మంత్రి సవిత

జగన్ కు మెగా డీఎస్సీ పైన మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అయిదేళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ఆరోపణలు చేయటం హాస్యాస్పదం అన్నారు. అయిదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగులను మోసగించారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తన మొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పై చేసి, 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.

Mega DSC AP Minister Savitha Challenges YS Jagan to Prove Mega DSC Allegations and slams jagan over mega DSC

మెగా డీఎస్సీ నిర్వహణపై జగన్ విషం కక్కుతున్నారు

ఎటువంటి అక్రమాలు జరగకపోయినా, అవినీతి జరిగిందంటూ జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకోడానికి జగన్ కోర్టుల్లో ఎన్నో కేసులు వేశారన్నారు. ఆ అడ్డకుంలన్నీ అధిగమించి, మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీని ఎటువంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించారన్నారు. ఓర్వలేని తనంతో మెగా డీఎస్సీ నిర్వహణపై జగన్ విషం కక్కుతున్నారన్నారు.

ఐదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్

అయిదేళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్ అని మంత్రి సవిత మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించడమేకాకుండా, ఇదేంటని ప్రశ్నించి వారిని తీవ్ర వేధింపులకు గురిచేశారన్నారు. బీసీలపై తప్పుడు కేసులు పెట్టి బీసీ గర్జన అంటూ మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ శవరాజకీయాలు చేస్తున్న వైసీపీని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నాం

రాబోయే మున్సిపల్, జెడ్పీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. జగన్ ను, ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తు.చ.తప్పకుండా అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+