ఆయన క్షేమం కోసం ప్రార్థించిన మెగాస్టార్: త్వరగా కోలుకోవాలంటూ

అమరావతి: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొంతమేర తగ్గినట్టే కనిపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని రాష్ట్రాలు వీకెండ్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. అటు ఒమిక్రాన్ వేరియంట్ రోజువారీ కేసుల్లోనూ పెరుగుదల చోటు చేసుకుంది. వాటి సంఖ్య 10 వేలను దాటేసింది.

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..24 గంటల వ్యవధిలో కొత్తగా 3,06,064 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 439 మంది మరణించారు. 2,43,495 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,95,43,328కు చేరింది. 4,89,848 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. యాక్టివ్ కేసులు 22,49,335గా రికార్డయ్యాయి.

Mega Star Chiranjeevi tweeted that Vice President Venkaiah Naidu speedy recover from Covid19

దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, వైఎస్ఆర్సీపీ లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ కోవిడ్‌కు గురయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటిదాకా 850 మందికి లోక్‌సభ, రాజ్యసభ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సమాయాత్తమౌతోన్న ఈ పరిస్థితుల్లో పార్లమెంట్‌లో కోవిడ్ కలకలం రేపింది.

కాగా- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా వైరస్ సోకడం పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. గెట్ వెల్ సూన్ సర్.. అంటూ ట్వీట్ చేశారు. వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నారు. తన ఆరోగ్యం బాగుందని, త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. ఈ మధ్యకాలంలో తనను క‌లిసిన వారంద‌రూ కోవిడ్ నిర్ధారణ పరీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+