పవన్ కల్యాణ్, మహేష్ బాబును పిలిపించిన చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా కథానాయిక కాగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది. ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విడుదలకు ముందుగా ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కథానాయకుడు చిరంజీవి ఒక ఆలోచన చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.
బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ మీద పడింది. బ్రో కలెక్షన్స్ అదిరిపోయాయి. దీంతో భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్, మహేష్ బాబును పిలిపించాలని చిరంజీవి ఆలోచన చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. మెహర్ రమేష్ తో మహేష్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ తో చిరు మాట్లాడితే సరిపోతుంది.

వీరిద్దరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే భోళా శంకర్ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతాయనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభిమానులకు మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేయడం నచ్చలేదు. కానీ సినిమా బాగా వచ్చింది.. సూపర్ హిట్ అవుతుంది.. బ్లాక్ బస్టర్ అవుతుంది అనే భరోసాను వారిలో కల్పించాలంటే పవన్ కల్యాణ్ ను, మహేష్ బాబును అతిథులుగా ఆహ్వానించాలని భావిస్తున్నారు.
ఈ విషయమై వారిద్దరినీ పిలిపించి ఇప్పటికే మాట్లాడినట్లుగా వార్త వైరల్ గా మారింది. సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ దక్కుతోంది. తమ అభిమాన కథానాయకుడు చిరంజీవి ఎప్పటికీ హీరోగానే ఉండాలని వారంతా భావిస్తున్నారు. అంతే జోష్ గా ఉండాలని, నృత్యం, ఫైట్లు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. మహేష్ బాబును, పవన్ కల్యాణ్ ను చిరంజీవి పిలిపించి మాట్లాడారు అనే వార్తలో నిజమెంతో తెలియదుకానీ వారిద్దరూ వస్తే బాగుంటుందని చిరు అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications